రింగ్‌ మాస్టర్‌కు ఝలక్‌.. నువ్వు లక్కీఫెలో భయ్యా! | Circus Tiger Bites Ringmaster Leg And Drags During Live Performance | Sakshi
Sakshi News home page

రింగ్‌ మాస్టర్‌కు ఝలక్‌.. నువ్వు లక్కీఫెలో భయ్యా!

Feb 19 2023 7:29 PM | Updated on Feb 20 2023 5:34 AM

Circus Tiger Bites Ringmaster Leg And Drags During Live Performance - Sakshi

వన్యమృగాలతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని ఎన్నో వీడియోల్లో చూసే ఉంటాం. అయితే, జంతువులకు ఎంత ట్రైయినింగ్‌ ఇచ్చినప్పటికీ పలు సందర్భాల్లో అవి దాడి చేస్తుంటాయి. తాజాగా అలాంటి ఘటనే సర్కస్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో రింగ్‌ మాస్టర్‌ గాయపడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

ఓ చోట సర్కస్‌ జరుగుతోంది. ఇందులో భాగంగా రింగ్‌ మాస్టర్‌.. రెండు పులులను స్టేజ్‌ మీదకు తీసుకువచ్చాడు. పులులతో సర్కస్‌ ఫీట్‌ చేస్తుండగా.. ఓ పులి రింగ్‌ మాస్టర్‌పై దాడి చేసింది. రింగ్‌ మాస్టర్‌ కాలిపై దాడి చేసి.. నేలపై లాగుతూ కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఇంతలో పక్కనే ఉన్న మరో వ్యక్తి పులిని నిలువరించే ప్రయత్నం చేశాడు. 

అక్కడే ఉన్న టేబుల్ సహాయంతో రింగ్‌మాస్టర్‌ను పులి దాడి నుంచి విడిపించాడు. కాగా, పులి దాడిలో రింగ్‌ మాస్టర్‌ గాయపడ్డాడు. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోపై నెటిజన్లు స్పందిస్తూ ఫన్నీ కామెంట్స్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement