‘నితీశ్‌ తలవంచక తప్పదు’

Chirag Paswan Says Nitish Kumar Will Bow Before Tejashwi Yadav - Sakshi

పాట్నా: ఈ నెల 10వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నితీశ్‌కుమార్‌, మహాకూటమి సీఎం అభ్యర్థి తేజస్వీ యాదవ్‌ ముందు తలవంచకతప్పదు అని ఎల్‌జేపీ నేత చిరాగ్‌ పాశ్వన్‌ అన్నారు. గురువారం చిరాగ్‌ మీడియాతో మాట్లాడుతూ, నువ్వు( సీఎం నితీశ్‌ కుమార్‌) ఏ ప్రధానితో అయితే ఎప్పుడు గొడవపడుతూ, విమర్శిస్తూ ఉంటావో ఇప్పుడు నీ కోసం ఓట్లు అడగమని అతని ముందే తల దించావు. దీన్ని బట్టే నీకు ముఖ్యమంత్రి పదవి అన్న, ఆ అధికారం అన్న ఎంత ఆశ ఉందో అర్ధం అవుతోంది. నవంబర్‌ 10 తరువాత నువ్వు  తేజస్వీ యాదవ్‌ ముందు తలవంచక తప్పదు’ అని అన్నారు. 

ఇప్పటికే బిహార్‌లో మూడవదశ పోలింగ్‌ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో అధికార పక్షం ప్రతిపక్షంపై తూటాలు ఎక్కు పెట్టింది. ఫైనల్‌ దశ  పోలింగ్‌ శనివారం నాడు జరగనుంది. ఈ నేపథ్యంలో పరాగ్‌ కేం‍ద్రప్రభుత్వంతో నితీశ్‌ వ్యతిరేకించిన విషయాలను చర్చించారు. ఆర్టికల్‌ 370, సీఏఏ విషయంలో నితీశ్‌ విబేధించారని అయితే ఇప్పుడు  ఎన్నకల సమయంలో మద్దతు కోసం నితీశ్‌ కేం‍ద్రప్రభుత్వంతో ఉన్న విబేధాలను మర్చిపోయారని మండిపడ్డారు. 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి కూడా నితీశ్‌ బిహార్‌ను అభివృద్ధి పరచలేదని విమర్శించారు. నితీశ్‌ కుమార్‌ ఇప్పటి వరకు ఐదు సార్లు బిహార్‌కు ముఖ్యమంత్రిగా ఎన్నికైన సంగతి తెలిసిందే.  
 

చదవండి: సీఎంపై రాళ్లదాడి, ఫెయిల్యూర్‌ అంటూ..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top