China: అప్పగించే ముందు ‘చైనా’ చిత్రహింసలు పెట్టింది!.. మిరమ్‌ తల్లిదండ్రుల కన్నీళ్లు

China Army Tortured Arunachal Teen Miram Taron Alleges Father - Sakshi

అగర్తలా: చైనా భూభాగంలో గల్లంతైన భారతీయ బాలుడు మిరమ్‌ తరోన్‌.. తీవ్ర ఉద్రిక్తతల నడుమ తిరిగి స్వదేశానికి చేరుకున్న సంగతి తెలిసిందే.  అయితే అప్పటిదాకా బంధీగా ఉంచుకుని.. అప్పగించే ముందు తమ కొడుకును చైనా సైన్యం చిత్ర హింసలు పెట్టిందని బాలుడి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. 

చైనా సైనికులు మిరమ్‌ తరోన్‌ను చాలాసార్లు తన్నారని, రెండుసార్లు కరెంట్‌ షాకిచ్చారని  తండ్రి ఓపాంగ్‌ తరోన్‌ ఆరోపించారు. కుమారుడి రాక సంతోషాన్నిచ్చిందని, కానీ మిరామ్‌ను చైనా బాధించిందని ఆ పేద రైతు వాపోయారు. చైనా భూభాగంలోకి వచ్చినట్లు గమనించి తప్పించుకోవడానికి మిరమ్‌ యత్నించాడని, కానీ చైనా సైనికులు పట్టుకొని హింసించారని ఓపాంగ్‌ చెప్పారు. అనంతరం మిరమ్‌ను బంధించి టిబెట్‌ భాషలో ప్రశ్నించారని, వారి భాష అర్థం కాక తన కుమారుడు సరైన సమాధానమివ్వకపోవడంతో కరెంటు షాకులిచ్చారని తెలిపారు.

ఎప్పుడైతే మిరమ్‌ మిస్సింగ్‌ వార్త మీడియాలో వచ్చిందో.. ఆపై హింసించడం మానుకున్నారన్నారు. ఇప్పటికీ తన కుమారుడు చాలా బాధను అనుభవిస్తున్నాడన్నారు. మిరమ్‌కు చికిత్సనందిస్తామని భారత ఆర్మీ అభయం ఇచ్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. జనవరి 18న మిరమ్‌ తరోన్‌ కనిపించకుండా పోయాడు. దీనిపై భారతీయ ఆర్మీ వెంటనే స్పందించి ఆచూకీ కనిపెట్టమని చైనా ఆర్మీని కోరింది. అనంతరం తమ బంధీగా ఉన్న మిరమ్‌ను.. పలు చర్చల అనంతరం జనవరి 27న చైనా ఆర్మీ మిరామ్‌ను భారత్‌కు అప్పగించింది.

సంబంధిత వార్త: మిస్సింగ్‌’ మిరమ్‌ తరోన్‌ దొరికాడు! చైనా ఆర్మీ ప్రకటన

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top