దంతేవాడ పేలుడు సూత్రధారి ఇతనే.. మావోయిస్టు దళంలో కీలక పాత్ర..

Chhattisgarh Dantewada Blast Mastermind Jagadish Photo History - Sakshi

రాయ్‌పూర్‌: ఛత్తీస్‌గఢ్‌లోని నక్సల్స్ ప్రభావిత దంతేవాడ జిల్లాలోని అరన్‌పూర్ పేలుడు సూత్రధారి జగదీష్ చిత్రం తెరపైకి వచ్చింది.  ఇతను చాలా కాలంగా బస్తర్‌లో యాక్టివ్‌గా ఉన్నాడు.  నివేదికల ప్రకారం, అరన్‌పూర్‌లో జరిగిన పేలుడులో జగదీష్ మొత్తం సంఘటనకు ప్రణాళికను సిద్ధం చేశాడు.  ఈ నక్సలైట్ నాయకుడి నేతృత్వంలోనే దంతేవాడలోని అరన్‌పూర్‌లో పేలుడు జరిగింది. ఈ ఘటనలో 10 మంది జవాన్లు,  ఒక డ్రైవర్ బలి అయ్యారు.

గతంలో జగదీష్ కాటేకల్యాణ్ ఏరియా కమిటీలో మాత్రమే యాక్టివ్‌గా ఉండేవాడు. అయితే పెద్ద పెద్ద సంఘటనలను నిరంతరం అమలు చేయడంలో విజయం సాధించడంతో జగదీష్ క్యాడర్ పెరిగింది.  నక్సలైట్ల సైనిక దళంలో ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నాడు.  జగదీష్ ప్రాథమికంగా జాగరగుండ తూర్పు గ్రామానికి చెందినవాడు.  ఇతనిపై రూ.5 లక్షల రివార్డు ప్రకటించారు.  అరన్‌పూర్ పేలుడు తర్వాత  జగదీష్‌తో పాటు మరో 12 మంది నక్సలైట్లపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

దర్భా డివిజనల్ కమిటీలో చురుగ్గా ఉన్న నక్సల్స్ జగదీష్, లఖే, లింగే, సోమడు, మహేష్, హిద్మా, ఉమేష్, దేవే, నంద్ కుమార్, లఖ్మా, కోసా, ముఖేష్, చైతు, మంగ్తు, రాన్సాయి, జయలాల్, బమన్, సోమ, రాకేష్, భీమాతో పాటు మరికొందరిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.  అందరిపై యూఏపీఏ చట్టం ప్రయోగించారు.
చదవండి: బీజేపీ ఎమ్మెల్యే హత్య కేసు.. బీఎస్పీ ఎంపీకి షాక్.. గ్యాంగ్‌స్టర్‌కు పదేళ్ల జైలు.. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top