ఆక్సిజన్‌ కొరత.. ఏడుగురి మృతి

Chennai: 6 Covid Patients Die In A Night As Oxygen Runs Out - Sakshi

సాక్షి, చెన్నై: రోగులకు ఆక్సిజన్‌ అందక ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులో సోమవారం చోటు చేసుకుంది. వేలూరు జిల్లా అడుక్కంపారై ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక వార్డులో పాజిటివ్‌ రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే ఆక్సిజన్‌ అందక రాజేశ్వరి (68), ప్రేమ్‌ (40), సెల్వరాజ్‌ (66) సహా ఏడుగురు మృతి చెందారు. ఆక్సిజన్‌ కొరత అని కొందరంటుండగా, ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత లేదని, వేర్వేరు కారణాలతో రోగులు మృతిచెందారని వేలూరు కలెక్టర్‌ షణ్ముగ సుందరం, ఆస్పత్రి డీన్‌ సెల్వి తెలిపారు. కరోనా సెకెండ్‌ వేవ్‌తో తమిళనాడు అతలాకుతలమవుతోంది. రోజుకు 10 వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. సోమ వారం 10,941 కేసులు నిర్ధారణ అయ్యాయి. 44 మంది మృతి చెందారు.

చదవండి: (పరిస్థితి భయానకం.. ప్రతి 3 నిమిషాలకు ఒకరు మృతి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top