
ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. మహీంద్ర అండ్ మహీంద్ర అధిపతిగా కేవలం కార్లు గురించి మాత్రమే మాట్లాడుతారనుకుంటే పొరపాటే ఆధునిక టెక్నాలజీనుంచి, క్రీడలు, మోటివేషనల్ వీడియోల దాకా ప్రతీ అంశాన్నీ ఆయన తన ఫాలోవర్లతో పంచుకుంటారు.
అంతేకాదు అవసరం అనుకున్న వారికి తన వంతు సాయం చేయడంలో ఎపుడూ ముందే ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఎమోషనల్ వీడియోను ఎక్స్ ( ట్విటర్) లో షేర్ చేశారు. సానుకూల మార్పు వైపు పయనం అంటూ ఒక వీడియోను షేర్ చేశారు. అలాగే ముందుగానే అందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇపుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. షేర్ చేసిన గంటలోనే ఇది 72వేలకు పైగా వ్యూస్‌ని సాధించింది.
భర్తకు యాక్సిడెంట్ కారణంగా కుటుంబాన్ని నడపటం భారమైన క్షణంలో భార్య తీసుకున్న నిర్ణయం విశేషంగా నిలిచింది. ఫీజుకు డబ్బులు కట్టాలి అడగడంతో ఈ వీడియో మొదలవుతుంది. నడవడం కష్టంగా ఉన్న తాను, ఇక ట్రక్ ఎలా నడుపుతాను, ఇప్పటికే వైద్యానికి చాలా ఖర్చయింది.. ఇక కుటుంబాన్ని ఎలా నడిపిస్తాను.. ఫీజులకు డబ్బు ఎక్కడ నుంచి తేవాలి అంటూ భర్త ఆవేదన చెందుతూ వుంటాడు. భర్తను ఆ స్థితిలో చూసిన భార్య కుటుంబానికి నడిపించేందుకు డ్రైవర్‌గా ముందుకు వస్తుంది. భరోసాతోనే ఇంటికి సంబంధించిన అన్ని బాధ్యతలు నాకు అప్పగించావు కదా. అదే భరోసాతో ట్రక్ నడుపుతాను అంటుంది. దీంతో అదే కొండంత భరోసాతో భార్యకు అండగా నిలుస్తాడు. చివరికి కాస్త ఒడ్డున పడతారు. భర్త మెల్లిగా నడవడం కూడా మొదలు పెడతాడు.
ఇంతలో దీపావళి పండుగ. దీపావళికి ఇంటికి వస్తున్నావుగా అన్నీ చూస్తావు కదా అని కూతురు దీపతో చెబుతుంది. ఈ సందర్భంగా లక్ష్మీ కళతో ఉట్టిపడుతున్న తన గృహ లక్ష్మిని చూసి మురిసిపోతాడు భర్త. ప్రతీ గృహలక్ష్మికి మహీంద్ర ట్రక్ అండ్ బస్ సలాం అంటూ దివాలీ శుభాకాంక్షలతో ఈ వీడియో ముగుస్తుంది. ఇది చూసిన నెటిజనులు సూపర్ సార్ అంటూ ప్రశంసలందిస్తున్నారు. పాజిటివ్ మెసేజ్ సార్.. హ్యాపీ దివాలీ అంటూ మరికొందరు యూజర్లు స్పందించారు.
ముఖ‍్యంగా మహీంద్ర ట్రక్ అండ్ బస్ ప్రమోషనల్ వీడియోలాగా ఇది అనిపించినా, మహిళలు ఏదైనా సాధించగలరనే సానుకూల వైఖరి, అవసరమైతే వారు డ్రైవింగ్ ఫోర్స్‌గా ఉంటారనే సందేశంతోపాటు, భార్యాభర్తల మధ్య ఉండాల్సిన అనుబంధాన్ని కూడా ఇది హైలైట్ చేస్తుంది. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి!
DRIVING positive change. Literally. Diwali greetings in advance from @MahindraTrukBus When every family member Rises to the occasion. pic.twitter.com/yYJcvKOwtP
— anand mahindra (@anandmahindra) November 8, 2023