
సాక్షి, న్యూఢిల్లీ : రైతు సంఘాల ప్రతినిధులతో కేంద్ర మంత్రుల చర్చలు జరుగుతున్నాయి. రెండున్నర గంటలుగా భేటీ కొనసాగుతోంది. రైతుల డిమాండ్లపై కేంద్రం ఓ మెట్టు దిగింది. సహేతుక డిమాండ్‌ల అమలుకు ఇబ్బంది లేదంది. కనీస మద్దతు ధర చట్టం తెచ్చేందుకు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ వివాదంలో ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు సుముఖత తెలిపింది. ప్రైవేట్ మండీలలో రిజిస్ట్రర్డ్ సంస్థలకే కొనుగోలు అవకాశం, సవరణల కోసం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేసే యోచన చేస్తోంది. సవరణలు వద్దని, మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతు సంఘాలు భీష్మించుకుని కూర్చున్నాయి. ( ప్రభుత్వం దిగిరాకపోతే భారత్ బంద్ )
చర్చల నుంచి వాకౌట్ చేస్తామని అంటున్నాయి. కొత్త చట్టం ముసాయిదా తయారీకి రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశాయి. రైతు కమిషన్‌లో కేవలం రైతులకు మాత్రమే స్థానం కల్పించాలని.. నిపుణులు, ఉన్నతాధికారులను చేర్చవద్దని, రైతు కమిషన్ ముసాయిదాతో కొత్త చట్టాన్ని తీసుకురావాలని కోరాయి.