Sakshi News home page

సైబర్‌ నేరగాళ్లకు చెక్‌.. రూ.1100 కోట్లు చేజారకుండా ఆపిన పోలీసులు

Published Wed, Jan 3 2024 3:58 PM

Central Home Department Succeeded In Preventing Cyber Crimes Last Year - Sakshi

న్యూఢిల్లీ: గడిచిన ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం సైబర్‌నేరగాళ్ల ఆట కట్టించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున సైబర్‌ నేరాలను అడ్డుకుంది. సైబర్‌ నేరగాళ్లు కొట్టేయడానికి ప్రయత్నించిన రూ.1100 కోట్లను  వారి ఖాతాల్లోకి వెళ్లకుండా చివరి నిమిషంలో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఆపగలిగారు. 

ఒక లక్ష జనాభాకుగాను గతేడాది అత్యధికంగా హర్యానాలో 381 సైబర్‌ క్రైమ్‌ నేరాలు రిపోర్ట్‌ అయ్యాయి. తెలంగాణలో  261, ఉత్తరాఖండ్‌ 243, గుజరాత్‌ 226,  గోవాలో 166 కేసులు నమోదయ్యాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధికంగా ఢిల్లీలో లక్ష జనాభాకు 755 కేసులు, చండీగఢ్‌లో 432 కేసులు నమోదయ్యాయి. సైబర్‌ నేరగాళ్ల ఆట కట్టించడంలో భాగంగా సైబర్‌ నేరగాళ్లకు చెందిన 2,95,461 సిమ్‌ కార్డులను, 2810 వెబ్‌సైట్‌లు, 585 మొబైల్‌ యాప్‌లు,46,229 ఐఎంఈఐలను కేంద్ర హోం శాఖ బ్లాక్‌ చేసింది.  

ఇదీచదవండి.. అశోక్‌ గహ్లోత్‌ కుమారుని ఇంటిపై ఈడీ సోదాలు

Advertisement

What’s your opinion

Advertisement