రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడితే.. రూ. 5 వేల ప్రోత్సాహకం

Central Govt Give Rs 5,000 To People Who Save Lives Road Accident Victims - Sakshi

న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారి ప్రాణాలను కాపాడే వారిని ప్రోత్సహిం చేందుకు కేంద్రం సరికొత్త పథకంతో ముందుకొచ్చింది. క్షతగాత్రులను మొదటి గంటలోగా (గోల్డెన్‌ అవర్‌) ఆస్పత్రికి తరలించిన వారికి రూ. 5 వేల ప్రోత్సాహక బహుమతి అందించనున్నట్లు ప్రకటించింది. ఈ పథకం 2021 అక్టోబర్‌ 15 నుంచి అందుబాటులోకి వచ్చి, 2026 మార్చి 31 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాల రవాణా శాఖల కార్యదర్శులకు సమాచారం పంపింది.

రూ. 5 వేల ప్రోత్సాహకంతో పాటు అభినందన సర్టిఫికెట్‌ను అందించనున్నట్లు పేర్కొంది. అత్యంత విలువైన సాయం అందించిన వారి నుంచి కొంత మందిని ఎంపిక చేసి ఏడాదికోసారి జాతీయ స్థాయి అవార్డులను ప్రకటించనున్నట్లు తెలిపింది. వారికి రూ. లక్ష చొప్పున ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఒకరి కంటే ఎక్కువ మంది బాధితులను, ఒకరి కంటే ఎక్కువ మంది కాపాడితే ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపింది. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top