ఎంపీ కార్తీ చిదంబరం సన్నిహితుడు భాస్కరరామన్‌ అరెస్ట్‌

CBI Arrests S Bhaskararaman Close Associate of Karti Chidambaram - Sakshi

చెన్నై: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత చిదంబరం వీసా కన్సల్టెన్సీ స్కాంలో కీలక మలుపు చోటుచేసుకుంది. చిదంబరం కుమారుడు కార్తీ అనుచరులను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేశారు. చెన్నైలో కార్తీ సన్నిహితుడు ఎన్‌ భాస్కర్‌ రామన్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా విదేశీ చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయంటూ కార్తీ చిదంబరంపై సీబీఐ మరో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 11 ఏళ్ల కిందట యూపీఏ హయాంలో తన తండ్రి చిదంబరం కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో పవర్‌ కంపెనీ పనుల నిమిత్తం భారత్‌ వచ్చిన 250 మంది చైనా పౌరులకు వీసాలు ఇచ్చేందుకు కార్తీ రూ. 50 లక్షల లంచం తీసుకున్నారని అధికారులు తెలిపారు. 

ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మంగళవారం కార్తి, ఆయన సన్నిహితుడు భాస్కరరామన్‌ సహా పలువురి నివాసాలు, అధికారిక కార్యాలయాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, ముంబయి, చెన్నై, ఒడిశా, శివగంగైలో ఈ సోదాలు జరిగాయి. తాజా కేసులో కార్తీతోపాటు ఆయన సన్నిహితుడు ఎన్‌ భాస్కర రామన్‌, తలవండీ, పవర్‌ ప్రాజెక్ట్‌ ప్రతినిధి వికాస్‌ మఖరియా, ముంబైకు చెందిన బెల్‌టూల్స్‌ తదితరుల పేర్లను కూడా చేర్చారు. భాస్కరరామన్‌ వద్ద చిక్కిన కొన్ని పత్రాలు ఈ కేసులో కీలకంగా సీబీఐ భావిస్తోంది. 
చదవండి: కార్తీ చిదంబరం ఇళ్లు, కార్యాలయాల్లో సీబీఐ సోదాలు.. సెటైర్‌ వేసిన ఎంపీ
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top