అనుకోని అదృష్టం.. చేపల వేటకు వెళ్తే నోట్ల కట్టలు ప్రత్యక్షం.. 

Bundles Of Currency Notes Found Floating Drain At Bihar Video Viral - Sakshi

పాట్నా: అదృష్టం ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. చేపలు పట్టేందుకు కాలువలో దిగిన వారికి అనూహ్యంగా కరెన్సీ నోట్ల కట్టలు దొరికాయి. దీంతో, ఎవరికి దొరికినన్ని నోట్లు వాళ్లు తీసుకెళ్లారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. రోహతక్‌ జిల్లాలోని ససారంలో ఉన్న సోన్‌ హైలెవల్‌ కెనాల్‌లో చేపల వేట కోసం మొరాదాబాద్‌ వంతెన వద్దకు శనివారం ఉదయం స్థానికులు కొందరు వెళ్లారు. ఈ క్రమంలో వారికి కరెన్సీ నోట్ల కట్టలున్న మూటలు కనిపించడంతో నమ్మలేకపోకపోయారు. తొలుత అవి నకిలీ నోట్లని అనుకున్నారు. కానీ, అసలైనవేనని తెలియడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. దీంతో, వెంటనే వాటిని చేజిక్కించుకోడానికి ఎగబడ్డారు. ఈ విషయం బయటకు తెలియడంతో అటుగా వెళ్లే వారందరూ నోట్ల కోసం కాలువలోకి దిగి దొరికినంత తీసుకెళ్లారు. 

కాగా, వారికి దొరికిన నోట్లలో ఎక్కువగా రూ.10 నోట్లు ఉండగా.. రూ.2,000, రూ.500, రూ.100 నోట్లు కూడా ఉన్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ నోట్లు కాల్వలోకి ఎలా వచ్చాయి? అని ఆరా తీస్తున్నట్టు తెలిపారు. 

ఇది కూడా చదవండి: కారు కింద 15 అడుగులు భారీ కింగ్‌ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top