breaking news
Sasaram district
-
అనుకోని అదృష్టం.. చేపల వేటకు వెళ్తే నోట్ల కట్టలు ప్రత్యక్షం..
పాట్నా: అదృష్టం ఎప్పుడు.. ఎలా.. ఏ రూపంలో తలుపు తడుతుందో ఎవరికీ తెలియదు. చేపలు పట్టేందుకు కాలువలో దిగిన వారికి అనూహ్యంగా కరెన్సీ నోట్ల కట్టలు దొరికాయి. దీంతో, ఎవరికి దొరికినన్ని నోట్లు వాళ్లు తీసుకెళ్లారు. ఈ ఘటన బీహార్లో చోటుచేసుకుంది. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల ప్రకారం.. రోహతక్ జిల్లాలోని ససారంలో ఉన్న సోన్ హైలెవల్ కెనాల్లో చేపల వేట కోసం మొరాదాబాద్ వంతెన వద్దకు శనివారం ఉదయం స్థానికులు కొందరు వెళ్లారు. ఈ క్రమంలో వారికి కరెన్సీ నోట్ల కట్టలున్న మూటలు కనిపించడంతో నమ్మలేకపోకపోయారు. తొలుత అవి నకిలీ నోట్లని అనుకున్నారు. కానీ, అసలైనవేనని తెలియడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీంతో, వెంటనే వాటిని చేజిక్కించుకోడానికి ఎగబడ్డారు. ఈ విషయం బయటకు తెలియడంతో అటుగా వెళ్లే వారందరూ నోట్ల కోసం కాలువలోకి దిగి దొరికినంత తీసుకెళ్లారు. కాగా, వారికి దొరికిన నోట్లలో ఎక్కువగా రూ.10 నోట్లు ఉండగా.. రూ.2,000, రూ.500, రూ.100 నోట్లు కూడా ఉన్నాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మరోవైపు.. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు స్పష్టం చేశారు. ఈ నోట్లు కాల్వలోకి ఎలా వచ్చాయి? అని ఆరా తీస్తున్నట్టు తెలిపారు. ఇది కూడా చదవండి: కారు కింద 15 అడుగులు భారీ కింగ్ కోబ్రా..పట్టుకున్న తీరు చూస్తే.. -
పాఠశాల పైకప్పు కూలి విద్యార్థులకు గాయాలు
ససారాం: పాము పాఠశాల్లోకి ప్రవేశించిందని పుకారు షికారు చేయడంతో... పాఠశాల విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దీంతో విద్యార్థులంతా పాఠశాల భవనం పైకప్పు ఎక్కారు. దాంతో విద్యార్థుల బరవు తట్టుకోలేక... పాఠశాల పైకప్పు కుప్ప కూలింది. ఈ ప్రమాదంలో 10 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటన బీహార్లోని ససారాం జిల్లా కచ్వా గ్రామంలో చోటు చేసుకుంది. అయితే విద్యార్థులను గ్రామంలోని స్థానిక ప్రాధమిక అరోగ్య కేంద్రానికి తరలించామని నసిర్గంజ్ సబ్ డివిజినల్ అధికారి అశోక్ కుమార్ వెల్లడించారు. విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఈ దుర్ఘటనపై దర్యాప్తునకు ఆదేశించినట్లు తెలిపారు. అలాగే పాఠశాల పైకప్పును త్వరగా బాగు చేయిస్తామని పేర్కొన్నారు.