కుప్పకూలిన రెండంతస్తుల భవనం.. పలువురికి గాయాలు

సాక్షి, న్యూఢిల్లీ: నంద్‌నగరిలోని ఓ రెండంతస్తుల భవనం కుప్ప కూలింది. శనివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనం శిథిలాల కింద నలుగురు వ్యక్తులు చిక్కుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సహాయ చర్యలు కొనసాగుతున్నాయని డీఎఫ్‌ఎస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ చెప్పారు.