ఎక్కడికి పోతావు చిన్నవాడా? పరారైన వరుడిని వెంబడించి పట్టుకున్న వధువు

Bride Runs After Groom on The Road After He Refuses To Marriage - Sakshi

పాట్నా: కొన్ని పెళ్లిళ్లు సినిమా కథకు ఏమాత్రం తీసిపోవు. డ్రామా, సస్పెన్స్‌, విషాదం వంటి అన్ని అంశాలు అందులో కనిపిస్తాయి. అలాంటి వివాహమే ఒకటి బిహార్‌లోని నవాడా ప్రాంతంలో జరిగింది. భగత్‌ సింగ్‌ చౌక్‌ ప్రాంతంలో పెళ్లి వద్దు బాబోయ్‌ అంటూ పరారైన ఓ వరుడిని వధువు వెంబడించి పట్టుకుంది.  వరుడి వెంట వధువులు పరుగులు పెడుతున్న ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 

ఇంతకీ ఏం జరిగిందంటే?
ఇరువురికి మూడు నెలల క్రితం వివాహం నిశ్చయించారు. వరుడి కుటుంబానికి రూ.50వేల కట్నం, ఓ బైక్‌ ఇచ్చారు. అయితే, వివాహ ముహూర్తం నిర్ణయించటంలో వరుడు దాటవేస్తూ వస్తున్నాడు. ఈ క్రమంలో యువకుడి ఇంటికి వెళ్లగా అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. దీంతో శివంగిలా మారిన వధువు.. అతడిని వెంబడించింది. తగ్గేదేలే అంటూ ఛేజింగ్‌ చేసి మరీ పట్టుకుంది. తనను పెళ్లి చేసుకోవాలని కోరింది. అయినా.. ఒప్పుకోకపోవటంతో పోలీస్‌ స్టేషన్‌కు చేరింది వ్యవహారం. ఇరువురికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చివరకు వధువును పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు యువకుడు. దీంతో ఆ పోలీస్‌ స్టేషన్‌కు సమీపంలోని ఓ గుడిలో ఇద్దరికి వివాహం జరిపించారు కుటుంబ సభ్యులు.

ఇదీ చదవండి: రైల్వే ట్రాక్‌ దాటుతుండగా దూసుకొచ్చిన ట్రైన్‌.. తునాతునకలైన బైక్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top