New Bride Dead After Collapse During Wedding Reception In Karnataka, Parents Donates Organs - Sakshi
Sakshi News home page

రిసెప్షన్‌లోనే కుప్ప కూలిన పెళ్లికూతురు..

Feb 13 2022 9:18 AM | Updated on Feb 13 2022 11:13 AM

Bride Brain Dead Collapses During Wedding Reception  - Sakshi

(కర్ణాటక) శ్రీనివాసపురం: పెళ్లికూతురిపై మృత్యువు పంజా విసిరింది. పెళ్లికి ముందురోజు రిసెప్షన్‌లో కుప్పకూలగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్‌డెడ్‌ అయ్యింది. వివరాలు ... శ్రీనివాసపురం తాలూకాకు చెందిన రామప్ప కుమార్తె చైత్ర (26) కైవార  కళాశాలలో లెక్చరర్‌గా ఉద్యోగం చేస్తోంది. ఆమెకు హొసకోటకు చెందిన యువకునితో వివాహం నిశ్చయమైంది. ఈ నెల 6న వీరి వివాహం శ్రీనివాసపురం పట్టణంలో నిర్వహించాల్సి ఉంది.

ముందు రోజు రిసెప్షన్‌ జరుగుతున్న సమయంలో వధువు చైత్ర కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు బెంగుళూరు నిమ్హాన్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆరు రోజులుగా చికిత్స చేసిన వైద్యులు ఆమెకు బ్రెయిన్‌ డెడ్‌ అయ్యిందని చెప్పడంతో  నిశ్చేష్టులయ్యారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు అవయవదానం చేసి తల్లిదండ్రులు మానవత్వం చాటుకున్నారు. అత్తవారింటికి వెళ్లడానికి బదులు కాటికి చేరుకుందని బంధుమిత్రులు విలపించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement