ప్రధాని మోదీతో బ్రిటన్‌ పీఎం బోరిస్‌ జాన్సన్‌.. సచిన్‌, అమితాబ్‌లా ఫీల్‌ అయ్యానంటూ..

Boris Johnson Interesting Comments On India Grand Welcome - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటన్‌ ప్రధానమంత్రి బోరిస్‌ జాన్సన్‌ భారత పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆయన ఇండియాకు చేరుకున్నారు. మొదటిరోజు భారత ప్రధాన నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో బోరిస్‌ జాన్సన్‌ పర్యటించారు. రెండో రోజు ఢిల్లీలో ప్రధాని మోదీతో బోరిస్‌ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు.

ఇదిలా ఉండగా.. గురువారం గుజరాత్‌లో పర్యటనను బోరిస్‌ జాన్సన్‌ గుర్తు చేసుకొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో తనకు ఇంత ఘనంగా స్వాగతం పలికినందుకు భారత ప్రజలకు, ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. గుజరాత్‌లో తన స్వాగత హోర్డింగ్స్‌ చూసి.. ఆయన ఓ సచిన్‌ టెండూల్కర్‌, బిగ్‌బీ అమిత్‌ బచ్చన్‌లా ఫీలయ్యానని అన్నారు. ఇలాంటి స్వాగతాన్ని తాను మరెక్కడా చూడలేనమోనని కామెంట్స్‌ చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తనకు మంచి స్నేహితుడని బోరిస్‌ ప్రకటించారు. 

మరోవైపు.. బోరిస్ జాన్సన్‌ భారత పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భార‌త్ ఆజాదీకా అమృత్ మ‌హోత్సవ్‌ వేడుక‌లు జ‌రుపుకుంటున్న సమయంలో బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ పర్యటించడం ఆనందంగా ఉందన్నారు. ఇది ఓ చారిత్రక సందర్భం అంటూ మోదీ వ్యాఖ్యానించారు. 

ఇది చదవండి: భారత్‌.. ఏ దేశానికీ ముప్పు కాదు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top