'ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ హత్యకు కుట్ర' | BJP Trying to Kill Arvind Kejriwal Says AAP After Violence at his Home | Sakshi
Sakshi News home page

'ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్ హత్యకు కుట్ర'

Mar 30 2022 5:29 PM | Updated on Mar 30 2022 5:56 PM

BJP Trying to Kill Arvind Kejriwal Says AAP After Violence at his Home - Sakshi

న్యూఢిల్లీ: సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి కలకలం రేపింది. కశ్మీర్‌ పండిట్‌లపై కేజ్రీవాల్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేశారు.  సీఎం కార్యాలయం ఫ్రంట్ గేట్‌ను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ బారికేడ్లు దాటుకుని దూసుకెళ్లడంతోపాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. 

అయితే సీఎం ఇంటిపై దాడి ఘటనపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ పోలీసుల సాయంతో బీజేపీ గూండాలు రెచ్చిపోయారంటూ ట్వీట్‌ చేశారు. కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో కేజ్రీవాల్‌ను ఓడించలేకపోవడంవల్లే ఆయనను హత్య చేసేందుకు బీజేపీ వేసుకున్న ముందస్తు పథకం అని ఆరోపించారు. 

చదవండి: (కశ్మీరి పండిట్లపై వ్యాఖ్యలు.. కేజ్రీవాల్‌ ఇంటిపై దాడి.. తీవ్ర హెచ్చరికలు)

పంజాబ్‌లో ఆప్ విజయం బీజేపీ ఓటమి కారణంగానే బీజేపీ అరవింద్ కేజ్రీవాల్‌ను హత్య చేయాలనుకుంటోందని ఆరోపించారు. ఈరోజు బీజేపీ గుండాలు పోలీసుల సమక్షంలోనే సీఎం నివాసం వద్ద  సీసీ కెమెరాలు, బారికేడ్‌లను బద్దలు కొట్టారని సిసోడియా  విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement