బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల | BJP releases list of Rajya Sabha candidates | Sakshi
Sakshi News home page

బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల

Jun 4 2026 6:38 PM | Updated on Jun 4 2026 8:46 PM

BJP releases list of Rajya Sabha candidates

ఢిల్లీ: బీజేపీ రాజ్యసభ సభ్యుల జాబితాను విడుదల చేసింది. మధ్యప్రదేశ్ నుంచి తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, గుజరాత్‌ నుంచి రాజుభాయ్ శుక్లా, ముకేశ్ భాయ్ రత్వ, మాన్సింగ్, జితేంద్ర మేక్జి భాయ్, మణిపూర్ నుంచి శారదా దేవి, రాజస్థాన్ నుంచి ఆల్క గుర్జర్, సతీష్ పునియా ,ఒడిశా నుంచి దేభాషిస్ సమంతరే, లు పోటీ చేయనున్నట్లు పార్టీ ప్రకటించింది.

కాగా ఇటీవలే రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. జూన్‌ 18న పెద్దల సభకు ఎన్నికలు జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. అదే రోజున ఫలితాలుంటాయి. దేశవ్యాప్తంగా 24 స్థానాలకు ఎ‍న్నికలు జరుగుతుండగా ఏపీలో నాలుగు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.నామినేషన్ దాఖలుకు జూన్‌ 8 చివరితేదీ కాగా జూన్‌ 9న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూన్‌ 11 వరకూ విత్‌డ్రాకు సమయముంటుంది. జూన్‌ 20తో ఎన్నికల ప్రక్రియ ముగుస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement