'నాపై హత్యాయత్నం జరిగింది'

BJP National Vice President Abdullah Kutty Vehicle Hit by lorry - Sakshi

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అబ్దుల్లా కుట్టీ  

మలప్పురం :  బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమితులైన ఏపీ అబ్దుల్లా కుట్టీ ప్రయాణిస్తున్న కారుని వెనక వైపు నుంచి లారీ ఢీ కొట్టింది. ఇది తనపై హత్యాయత్నమని ఆరోపిస్తూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వాహనాన్ని నడిపినందుకు లారీ డైవర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనను కేరళ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్‌ ఖండించారు. రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అలాగే తాను రెస్టారెంట్‌లో ఉండగా, తన కారుపై కొంతమంది దుండగులు రాళ్లు రువ్వారంటూ పోలీసులకు అబ్దుల్లా కుట్టీ మరో ఫిర్యాదు చేశారు. దీంతో పలువురు అనుమానితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రెండు సంఘటనలు ఉద్దేశపూర్వకంగా జరిగాయని, వీటిపై విచారణ జరిపి దోషులను పట్టుకొని, దీని వెనుక దాగి ఉన్న కుట్రను బహిర్గతం చేయాలని అబ్దుల్లా కుట్టీ కోరారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top