బిల్‌గేట్స్‌తో సమావేశం వండర్‌ఫుల్‌! కోవిడ్‌ నిర్వహణపై ప్రశంసల జల్లు! కేంద్ర ఆరోగ్య మంత్రి

Bill Gates Meets Health Minister Appreciated Indias COVID Management,  - Sakshi

భారతదేశ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ దేశా రాజధానిలోని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవియాతో భేటీ అయ్యారు. అంతేగాదు ఆరోగ్య మంత్రిత్వ శాఖలోని వార్‌రూమ్‌ని సైతం సందర్శించారు బిల్‌గేట్స్‌. వాస్తవానికి దీన్ని కోవిడ్‌ సమయంలో నేషనల్‌ పబ్లిక్‌ హెల్త్‌ అబ్జర్వేటరీ పేరుతో వార్‌ రూమ్‌ని రూపొందించారు. మన్సుఖ్‌తో జరిగిన సమావేశంలో బిల్‌గేట్స్‌ కోవిడ్‌ నిర్వహణ, టీకా డ్రైవ్‌, ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్ వంటి డిజిటల్‌ ఆరోగ్య కార్యక్రమాల గురించి తెలుసుకుని ప్రశంసించారు.

అలాగే ఆ సమావేశంలో బారత్‌ జీ20 ఆరోగ్య ప్రాధాన్యతలు, పీఎం భారతీయ జనౌషధి పరియోజన ఈ సంజీవని గురించి కూడా ఆరోగ్య మంత్రి మన్సుఖ్‌ బిల్‌గేట్స్‌తో చర్చించారు. ఈ మేరకు ఆరోగ్యమంత్రి మన్సుఖ్‌ మాండవీయా ట్విట్టర్‌ వేదికగా బిల్‌గేట్స్‌తో జరిగిన సమావేశం వండర్‌ఫుల్‌ అంటూ ఈవిషయాన్ని వెల్లడించారు. కాగా, బిల్‌గేట్స్‌ గతవారం తన బ్లాగ్‌లో భారత పర్యటన గురించి తెలియజేశారు. బ్లాగులో ఆయన..నేను వచ్చేవారం భారతదేశానికి వెళ్తున్నాను.

చాల ఏ‍ళ్లుగా అక్కడ చాలా సమయం గడిపినప్పటికీ..మరుగదొడ్లను తనిఖీ చేయడం నుంచి భారతదేశంలోని పేద, వెనుకబడిన కులాలు నివశించే గ్రామాన్ని సందర్శించడం వరకు ‍ప్రతిదీ చేస్తున్నాను. కోవిడ్‌కి ముందు నుంచి కూడా భారత్‌ని సందర్శించ లేకపోయాను. అక్కడ ఎంత వరకు పురోగతి సాధించిందో తెలుసుకునేంతం వరకు వేచి ఉండలేను అని రాసుకొచ్చారు. అలాగే భారతదేశాన్ని కొనయాడారు. భారతదేశం భవిష్యత్తుపై మంచి ఆశను కలిగిస్తుందన్నారు. ప్రపంచం పలు సంక్షోభాలతో అతలాకుతలం అయిపోతున్నప్పటికీ.. భారత్‌ మాత్రం ఎంత పెద్ద సమస్యనైనా  సరే సులభంగా పరిష్కరించగలదని నిరూపించిందన్నారు. 

(చదవండి: చైనాపై ఒత్తిడి తెచ్చేలా..రంగం సిద్ధం చేస్తున్న అమెరికా!)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top