హాయ్‌ అంటూ కవ్విస్తుంది.. ఇంటికి పిలిచి క్లోజ్‌గా ఉంటుంది.. ఆ తర్వాత..  | Bhubaneswar Woman Archana Arrested For Honey Trapping | Sakshi
Sakshi News home page

హాయ్‌ అంటూ కవ్విస్తుంది.. ఇంటికి పిలిచి ఎంజాయ్‌ చేస్తుంది.. ఆ తర్వాత.. 

Oct 9 2022 6:40 PM | Updated on Oct 9 2022 6:41 PM

Bhubaneswar Woman Archana Arrested For Honey Trapping - Sakshi

ఆమె తన అందంతో రంగంలోకి దిగి.. ప్రముఖులను ముగ్గులోకి దింపుతుంది. ప్రముఖ వ్యక్తులతో పరిచయం పెంచుకుని వారింతో సన్నిహితంగా మెదులుతుంది. ఈ క్రమంలో వారితో తీసుకున్న ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ హానీట్రాప్‌ చేస్తుంది. ఇలా డబ్బులు వసూలు చేస్తున్న అర్చనా నాగ్‌ను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. 

కాగా, విచారణలో భాగంగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందుతురాలు అర్చనకు భువనేశ్వర్‌లో విశాలమైన భవనం ఉన్నట్టుగా గుర్తించారు. ఇక, అర్చన.. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ ద్వారా ప్రముఖులు, సంపన్నులు, ఉన్నతాధికారులతో పరిచయం పెంచుకుంటుంది. అనంతరం.. మాటలు కలిపి వారిని ముగ్గులోకి దింపుతుంది. పరిచయం అనంతరం.. వారిని తన నివాసానికి రప్పించుకునేది. వారితో సన్నిహితంగా ఉన్న సమయంలో సీక్రెట్‌గా ఫొటోలు, వీడియోలు తీసేది. 

అనంతరం, వారికి ఈ ఫొటోలు, వీడియోలను పంపించి డబ్బులు వసూలు చేసేది.  తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానని బెదిరింపులకు గురిచేసేది. ఇక, కొంతమంది పోలీసు అధికారులు కూడా ఆమె వలలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. ఆమెకు ఎంతో ఖరీదు చేసే బీఎండబ్ల్యూ, ఫోర్డు తదితర కంపెనీల కార్లు, ఫార్మ్‌ హౌస్‌ కూడా ఉన్నట్టు గుర్తించారు.

కాగా, అర్చనను అరెస్ట్‌ చేసిన అనంతరం.. పోలీసులు ఆమె కంప్యూటర్‌ హార్డ్‌ డిస్క్‌, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. సెల్‌ఫోన్‌లోని ఫొటోలు, వీడియోలను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపినట్టు వెల్లడించారు. మరోవైపు.. ఆమె బ్యాంకు ఖాతాలు, లావాదేవీలకు సంబంధించిన వివరాలను సైతం ఇవ్వాలని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ)ని కోరినట్టు డీసీపీ ప్రతీక్‌ సింగ్‌ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement