'26 కులాలకు రిజర్వేషన్‌ తొలిగింపు..వి​‍ద్యార్థులకు తీవ్ర నష్టం'

BC Community Leaders  Meet  National BC Commission At Delhi - Sakshi

ఢిల్లీ: ఏపీకి చెందిన 26 బీసీ కులాలకు తెలంగాణలో రిజర్వేషన్ పునరుద్ధరణపై  బీసీ సంఘాల నేతలు, విద్యార్థులు జాతీయ బీసీ కమిషన్‌ను కలిశారు. ఈ సందర్భంగా బీసీ కులాల పోరాట కమిటీ అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ..'తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే 26 కులాలకు రిజర్వేషన్ తొలగించింది. 6 దశాబ్దాలుగా ఈ కులాలవారు తెలంగాణలో స్థిరనివాసం ఏర్పాటుచేసుకుని జీవిస్తున్నారు. గౌడ కులంలో శెట్టిబలిజ ఉపకులంగా ఉంది. ప్రభుత్వ నిర్ణయంతో శెట్టిబలిజలకు రిజర్వేషన్ లేకుండా పోయింది.

తెలంగాణలో స్థిరపడ్డవారంతా భవన నిర్మాణ కార్మికులుగా, వడ్రంగి, టైలరింగ్ వంటి స్కిల్డ్, అన్‌స్కిల్డ్ పనులు చేసుకుంటున్నారు. గత 6ఏళ్లుగా రిజర్వేషన్లు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు' అని పేర్కొన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టులో వేసిన కేసులో తెలంగాణ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేయడం లేదని, జాతీయ బీసీ కమిషన్ నివేదిక కోరినా  సమర్పించడం లేదని ధ్వజమెత్తారు. రిజర్వేషన్ కోల్పోయిన 26 కులాలకు వెంటనే రిజర్వేషన్ పునరుద్ధరించాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను కోరారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top