అయ్యో నా కూతురు చ‌నిపోయింది సార్‌, మీకు డ్రామాలా ఉందా? 

Baby Girl Ends Life Over Doctor Refuses Treatment In Uttar Pradesh Hospital - Sakshi

మంచం మీద నుంచి కింద ప‌డ్డ చిన్నారి 

2 గంట‌ల పాటు చిన్నారికి అంద‌ని ట్రీట్మెంట్ 

ప్రాణాలు కోల్పోయిన చిన్నారి 

క‌న్నీరుమున్నీర‌వుతున్న త‌ల్లిదండ్రులు 

ల‌క్నో:దేశంలోని కొన్ని ప్రాంతాల్లో క‌రోనా కార‌ణంగా ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్ట‌ర్లు సాహ‌సం చేయ‌డం లేదు.దీంతో ప‌లువురు అమాయ‌కులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ ఐదేళ్ల చిన్నారికి క‌రోనా సోకింద‌నే అనుమానంతో ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్ట‌ర్లు చికిత్స చేయ‌లేదు. స‌కాలంలో ట్రీట్మెంట్ చేయ‌క‌పోవ‌డంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. 

ఉత్త‌ర్ ప్ర‌దేశ్ బారాబంకి జిల్లాకు చెందిన గౌస్‌పూర్‌లో ఓ ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ మంచం మీద నుంచి కింద‌ప‌డింది. అయితే అత్య‌వ‌స‌ర చికిత్స కోసం ఆమె త‌ల్లిదండ్రులు చిన్నారిని గౌస్ పూర్కు చెందిన ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించారు. కానీ చిన్నారికి వైద్యం చేసేందుకు డాక్ట‌ర్లు ముందుకు రాలేదు. చివ‌రికి రెండు గంట‌ల త‌ర్వాత చ‌నిపోయింది. దీంతో డాక్ట‌ర్లు తీరుపై ఆవేద‌న వ్య‌క్తం చేసిన బాధితురాలి తండ్రి మృత‌దేహంతో ఆస్ప‌త్రి ఎదుట క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. ఆ హృద‌య విదారక‌ర దృశ్యాల్ని స్థానికులు వీడియోలు తీయ‌డంతో ఈ విషాదం చ‌ర్చనీయంగా మారింది. డాక్ట‌ర్లుపై చ‌ర్య‌లు తీసుకోవాల‌నే డిమాండ్లు వినిపించాయి.అయితే చిన్నారి మ‌ర‌ణంపై బారాబంకి చీఫ్ మెడిక‌ల్ ఆఫీసర్ బికెఎస్ చౌహాన్ మాట్లాడుతూ.. చిన్నారి మంచం పై నుంచి కింద ప‌డింద‌ని త‌ల్లిదండ్రులు చెప్పారు. ఆస్ప‌త్రికి తీసుకొచ్చిన వెంటనే పారామెడిక‌ల్ సిబ్బంది, డాక్ట‌ర్లు వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించి మార్గం మ‌ధ్య‌లోనే చ‌నిపోయిన‌ట్లు నిర్ధారించారు. ఆమె తండ్రి చేస్తున్న ఆరోప‌ణ‌ల్లో వాస్త‌వం లేద‌ని కొట్టిపారేశారు.  

వైద్యులు తీరు ఎలా ఉందో చూడండి? 

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలో చిన్నారి మృత‌దేహంతో విల‌పిస్తున్న తండ్రి.. చూడండి సార్. క‌రోనా బాధితుల్ని తాకేందుకు ఎవ‌రు ఇష్ట‌ప‌డ‌డం లేదు. రెండుగంట‌ల పాటు నా కుమార్తెకు ట్రీట్మెంట్ ఇచ్చేందుకు డాక్ట‌ర్లు ముందుకు రాలేదు. ఈ డాక్ట‌ర్లు తీరుతో నా పాప చ‌నిపోయింద‌ని వాపోయాడు. 

నా బిడ్డ చ‌నిపోయింది స‌హ‌నంతో ఉండాలా? 

డాక్ట‌ర్ల తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న తండ్రిని ఓదార్చేందుకు స్థానికులు ప్ర‌య‌త్నించారు. మీరు కొంచెం స‌హ‌నంతో ఉండాల‌ని స‌ముదాయిస్తుంటే నా బిడ్డ చ‌నిపోయింది. నేను సహనంతో ఉండాలా? అని ప్ర‌శ్నించాడు. 

ఇది మీకు డ్రామాలా ఉందా? 

అదే ఆస్ప‌త్రి భ‌య‌ట ఆందోళ‌న చేస్తున్నచిన్నారి తండ్రిని అడ్డుకునేందుకు పోలీసులు ప్ర‌య‌త్నించారు. ఏం డ్రామాలు చేస్తున్నావా అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో సార్ ఇది మీకు డ్రామాలా క‌నిపిస్తుందా? నా కూతురు చ‌నిపోయింది సార్ అంటూ క‌న్నీటి ప‌ర్యంత‌ర‌మ‌య్యాడు. చేసేది లేక  అధికారుల‌పై చ‌ర్య‌లు తీసుకుంటాం. మీరు స్టేష‌న్ లో ఫిర్యాదు చేయండని పోలీసులు చెప్ప‌డం పై స్థానికులు మండిప‌డుతున్నారు.  

చ‌ద‌వండి : షాకింగ్: ఇంట్లో పాములు.. అద్దెకే దిక్కులేదన్న ఓనర్‌!

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top