షాకింగ్: ఇంట్లో పాములు.. అద్దెకే దిక్కులేదన్న ఓనర్‌!

Snakes Fall Through Ceiling Of Family Rented House In Georgia - Sakshi

ఇంట్లో వేలాడుతున్న పాములు

అద్దెకే దిక్కులేద‌న్న ఓన‌ర్

ల‌బోదిబోమ‌న్న బాధితులు 

టిబిలిసి: సాధారణంగా ఇంట్లో బ‌ల్లులో, బొద్దింక‌లో కనిపిస్తేనే భ‌యపడిపోతాం. అలాంటిది.. ఇంటి సీలింగ్పై నుంచి పాములు వేలాడుతూ కనిపిస్తే ఎలా ఉంటుంది?. గుండె జ‌ల్లుమంటుంది. జార్జీయాకు చెందిన హ్యారీ పగ్లీస్ అనే వ్యక్తి ఓ అద్దె ఇంట్లో భార్య‌, పిల్ల‌ల‌తో నివ‌సిస్తున్నాడు. అయితే వ‌ర్షం ప‌డిన ప్ర‌తిసారి వాన నీరు ఇంట్లో కురిసేది. అదే విష‌యాన్ని ఇంటి య‌జ‌మానికి చెప్పాడు. కానీ ఇంటి య‌జ‌మానురాలు ప‌ట్టించుకోలేదు.

ఈ నేప‌థ్యంలో హ్యారీ ఇంట్లో ఉండ‌గా వ‌ర్షం ప‌డి ఇంటి పెచ్చులూడి కింద‌ప‌డిపోయాయి. పెచ్చులూడిన ప్రాంతం నుంచి ఎలుక‌లో, బ‌ల్లులో క‌నిపిస్తే ప‌ట్టించుకోనే వాడు కాదేమో. కానీ పాములు వేలాడుతూ క‌నిపించ‌డంతో ప్రాణ భ‌యంతో ప‌రిగెత్తుకుంటూ ఆ ఇంటి ఓన‌ర్తో మొర‌పెట్టుకున్నాడు. ‘మేడ‌మ్ ఇంటి సీలింగ్ ఊడింది. ఇంట్లో పాములు వేలాడుతున్నాయి. వెంటనే ఆ పాముల్ని తీయించండి’ అని కోరాడు.

అందుకు ఆ ఇంటి య‌జ‌మానురాలు.. ఆ పాముల్ని అక్క‌డి నుంచి తీయాలంటే సంబంధిత అధికారుల అనుమ‌తి తీసుకోవాల్సి ఉందని చెప్పింది. దీంతో హ్యారీ అధికారుల‌కు స‌మాచారం అందించారు. స‌మాచారం అందుకున్న అధికారులు బాధితుడి ఇంట్లో పాముల్ని తీసేందుకు సిద్దమ‌య్యారు. అందుకు ఆ ఇంటి య‌జ‌మానురాలు ఒప్పుకోలేదు.

‘హ్యారీ ఇంటి అద్దెకే దిక్కులేదు నీకు. రెండు నెల‌ల నుంచి అద్దె క‌ట్ట‌డం లేదు. ఇంటి అద్దె క‌డితే పాముల్ని అక్క‌డి నుంచి తీయించేస్తా’ అని ఆమె తెగేసి చెప్పింది. అలాగే రెండు రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా గ‌డిపాడు. చివ‌రికి ఇంటి య‌జ‌మానురాలి తీరుతో ఏం చేయాలో పాలుపోని బాధితుడు హ్యారీ త‌న‌కు జ‌రిగిన అన్యాయాన్ని నెటిజన్ల‌తో పంచుకున్నాడు. ప్ర‌స్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. 

చ‌ద‌వండి : ల‌క్ష‌ల‌తో కాదు, ఒక్క ఫోన్ కాల్ తో క‌రోనా పేషెంట్ల‌ను బ్ర‌తికిస్తున్నాడు
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top