వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.11 వేల కోట్ల రుణం

Asian Development Bank approves 1. 5 billion dollers loan to India for purchasing vaccines - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 వ్యాక్సిన్‌ కొనుగోలు కోసం ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు భారత్‌కు 150 కోట్ల అమెరికా డాలర్ల (దాదాపు రూ.11,185 కోట్లు) రుణాన్ని మంజూరు చేసింది. ఈ విషయాన్ని గురువారం ఏడీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌పై పోరాటం కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కొనుగోలు కోసం 150 కోట్ల అమెరికా డాలర్ల రుణాన్ని మంజూరు చేస్తున్నట్టుగా ఆ ప్రకటన తెలిపింది. చైనాలోని బీజింగ్‌ కేంద్రంగా పని చేసే ఆసియన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకు (ఏఐఐబీ) అదనంగా మరో 50 కోట్ల డాలర్లను రుణంగా ఇవ్వడానికి అవకాశాలున్నాయి.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top