అర్నబ్‌ గోస్వామి 40లక్షల లంచం ఇచ్చారు..

'Arnab Goswami Paid BARC Ex-CEO Rs 40 Lakh To Manipulate Ratings' - Sakshi

బార్క్ మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తా స్టేట్‌మెంట్‌ రికార్డు

అర్నబ్‌ నుంచి భారీ మొత్తం అందుకున్నా..

ముంబై: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్పీ కుంభకోణంలో రిపబ్లిక్‌ టీవీ ఛీప్‌ అర్నబ్‌ గోస్వామి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. తాజాగా రిపబ్లిక్ టీవీకి అనుకూలంగా రేటింగ్ మార్చేందుకు భారీ మెత్తంలో అర్నాబ్ గోస్వామి తనకు లంచం ఇచ్చారని బ్రాడ్‌‌కాస్ట్ ఆడియన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) మాజీ సీఈవో పార్థో దాస్‌గుప్తా తెలిపారు. ముంబై పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన స్టేట్‌‌మెంట్‌‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. టీఆర్పీలో మార్పులు చేసేందుకు గానూ తనకు 12వేల అమెరికన్‌ డాలర్లుతోపాటు మూడేళ్లకు గానూ రూ.40 లక్షల మొత్తాన్ని అర్నాబ్ తనకు ముట్టజెప్పారని దాస్‌‌గుప్తా పేర్కొన్నారు. మూడేళ్ల కాలంలో ఈ మొత్తాన్ని తాను తీసుకున్నానని ఆయన వెల్లడించారు. (టీఆర్పీ స్కాం: వైరలవుతోన్న వాట్సాప్‌ చాట్‌ )

‘2004 నుంచే అర్ణబ్ నాకు తెలుసు. టైమ్స్ నౌలో మేమిద్దరం కలిసి పనిచేసేవాళ్లం.  2013లో నేను బార్క్ సీఈవోగా నియమితుడినయ్యాను. ఆ తర్వాత  2017లో అర్ణబ్ రిపబ్లిక్ టీవీని ప్రారంభించారు. చానల్ ప్రారంభించక ముందే అర్ణబ్ పలు ప్రణాళికల గురించి నాతో  అనేకసార్లు చర్చించేవాడు. చానల్ రేటింగ్ పెంచడంలో సహాయం చేయాలని పరోక్షంగా మాట్లాడేవాడు. నాకు టీఆర్పీ గురించి అన్ని విషయాలు తెలుసన్న విషయం కూడా అర్ణబ్‌కు బాగా తెలుసు. ఇందుకు బదులుగా భవిష్యత్తులో నాకు  సాయం చేస్తానని మాటిచ్చాడు. దీంతో రిపబ్లిక్‌ టీవీకి నంబర్‌1 రేటింగ్‌ వచ్చేలా నా టీంతో కలిసి పనిచేశాను. 2017 నుంచి 2019 వరకు ఇది కొనసాగేది. ఇందుకుగానూ అర్నబ్‌ గోస్వామి నుంచి రెండేళ్ల వ్యవధిలోనే 12000 డాలర్లు (8లక్షల 74 వేలు) అందుకున్నాను' అని దాస్‌‌గుప్తా తెలిపారు.

టీఆర్పీ స్కాంకి సంబంధించి జనవరి 11న 3,600 పేజీల సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌‌ను ఇప్పటికే ముంబై పోలీసులు ఫైల్ చేశారు. ఈ కేసులో దాస్‌‌గుప్తాకు గోస్వామికి మధ్య జరిగిన వాట్సాప్ సందేశాలు, కాల్స్ వివరాలతోపాటు బార్క్ ఆడిట్ రిపోర్ట్‌‌ను కూడా పొందుపరిచారు. వీరిద్దరి మధ్యా 500 పేజీలకుపైగా ఉన్న ఈ చాట్‌ మెసేజ్‌లు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top