ప్రపంచంలోనే తొలి చైల్డ్‌ ఆర్టిస్ట్‌

Armaan Become The World Yougest Artist and holds Art Exhibition - Sakshi

న్యూఢిల్లీ: చిన్నారులు ముద్దులొలికే మాటలు, వారి హావాభావాలు చూస్తుంటే పెద్దలకు తమ సమయం ఎలా గడిచిపోతుందో కూడా తెలియదు. కొంత మంది పిల్లలు చిన్న వయసులో సహజ సిద్ధంగానే వాళ్లలో కొన్ని కళలు దాగి ఉంటాయి. పాట పాడటం, డ్యాన్స్‌ చేయడం లేదా మంచి జ్ఞాపకశక్తి తదితర టాలెంట్లను పిల్లలో చూసుంటాం. అయితే అతి చిన్న వయసులోనే కుంచె పట్టుకున్న అత్యంత ఆకర్షణీయమైన చిత్రాలను గీయగల పిల్లలను చూసి ఉండం కదా!. కానీ ఢిల్లీకి చెందిన మూడేళ్ల ఏళ్ల అర్మాన్ రహేజా సోలోగా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌ పెట్టి మరీ అందర్నీ ఆకర్షించేలా కాన్వాస్‌పై రంగురంగుల పెయింటింగ్‌లు వేసి అందరీ మన్నలను పొందుతున్నాడు.

(చదవండి: వామ్మో...ఓవర్‌ హెడ్‌ వైర్ల పై పెద్ద పాము)

అంతే కాదండోయ్‌ భారత్‌లోనే తొలిసారిగా అత్యంత పిన్న వయసులో ఇండియా హాబిటాట​ సెంటర్‌లో సోలోగా ఆర్ట్‌ ఎగ్జిబిషన్‌  నిర్వహించిన కళాకారుడుగా చరిత్రలో నిలవడమే కాక ప్రపంచంలోనే అత్యంత పిన్న కళాకారుల్లో ఒకడిగా కూడా స్థానం దక్కించుకున్నాడు. అయితే  ఆర్మాన్‌ తన చూట్టు ఉన్న పరిసరాలను నుండి స్ఫూర్తి పొందడమే కాక దానికి తన సృజనాత్మక శక్తిని జోడించి అక్రిలిక్, వాటర్ కలర్స్  పోస్టర్ రంగులను ఉపయోగించి కాన్వాస్‌పై రమణీయమైన చిత్రాలను గీస్తాడు. 

అర్మాన్‌ తల్లి కాశిష్ రహేజా ఎఫ్‌ఐడీఎంలో ఇంటిరియర్‌ డిజైనర్‌, తండ్రి నయన్ రహేజా న్యూఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్‌లో ఆర్కిటెక్ట్. ఈ మేరకు అర్మాన్‌ తల్లి కాశిష్ మాట్లాడుతూ....గతేడాది రంగులతో ఆడుతుంటే అది తనలోని  అసాధారణమైన ప్రతిభకు సంకేతంగా చెబుతున్నాడని అనుకోలేదు. తల్లిదండ్రులు కూడా పిల్లల అసాధారణ ప్రతిభ గుర్తించిగలిగితేనే వారికి అవసరమైన మార్గదర్శకత్వం అందించి ప్రోత్సహించగలరు.

ఈ విషయంలో స్కూల్‌ టీచర్‌ భావన, అమ్మమ్మ నిర్మల్ రహేజా కూడా అర‍్మాన్‌ ఆలోచనలను క్రమబద్ధీకరించడంలో సహాయపడట మేకాక తన ఆలోచనలకు ఒక నమూనాను రూపొందించగలిగేలా అర్మాన్‌ని మలిచారు. సూపర్నోవా, జెల్లీ ఫిష్ వంటి టైటిల్స్‌తో అర్మాన్‌ ప్రతి కాన్వాసులను ఎంత అద్భుతంగా గీస్తాడో కూడా వివరించారు. పైగా తమ కుమారుడి పనికి తగిన గుర్తింపు లభించినందుకు సంతోషంగా ఉంది" అని అన్నారు. 

(చదవండి: టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top