టాయిలెట్‌కి వెళ్లింది.. బిడ్డతో బయటకు వచ్చింది

Women Gives Birth in Toilet room At Petrol Station - Sakshi

పెట్రోల్‌బంక్‌ బాత్రుంలోనే ప్రసవం

బ్రిటన్‌: ఈ మధ్యకాలంలో టాయిలెట్‌లోనూ, బస్‌స్టేషన్‌లోనూ, ప్రభుత్వ ఆస్పత్రిలోని బాత్‌రూంలోనూ అనుకోకుండా ప్రసవం జరగడం గురుంచి మనం వినే ఉంటాం కదా. అచ్చం అలాంటి సంఘటన యూకేలో జరిగింది. యూకేకి చెందిన కైట్లిన్ ఫుల్లెర్టన్, సెర్గియో అనే దంపతులు కారులో సరదాగా బయటకు వెళ్లారు. అనోకోకుండా కైట్లిన్‌కి టాయిలెట్‌ రావడంతో సమీపంలో ఎలాంటి పబ్లిక్‌ టాయిలెట్స్‌ లేకపోవడంతో పక్కనే ఉన్న పెట్రోల్‌ బంక్‌లోని బాత్‌రూంలోకి వెళ్లింది.

(చదవండి: "థింక్‌ బి ఫోర్ యూ డయల్")

అనుకోకుండా ఆమెకు నొప్పులు మొదలై కేవలం 10 నిమిషాల్లోనే ప్రసవం అయిపోయింది. అంతేకాదు చక్కని మగబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆమె ఒక్కసారిగా ఏం చేయాలో తోచదు. అక్కడే ఉన్న కొంత మంది మహిళల సాయంతో విషయం తన భర్తకు తెలియజేయడంతో వెంటనే కైట్లిన్ భర్త సెర్గియో వస్తాడు. ఆ తర్వాత ఆమె భర్త సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్తాడు. తల్లి బిడ్డలు సురక్షింతంగానే ఉన్నారని వైద్యులు చెబుతారు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఏది ఏమైనా అనుకోకుండా ఇలా జరిగితే ఎవరికైన భయంగానూ, ఆశ్యర్యంగానూ అనిపిస్తుంది కదా. 

(చదవండి: "అవాక్కయేలా చేద్దాం అనుకుంటే అరెస్ట్‌ అయ్యాడు!")

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top