Police Releases Phone Call: "థింక్‌ బి ఫోర్ యూ డయల్"

Police Releases Phone Call Of Man Who Wanted Help With Putrid Chicken - Sakshi

బ్రిటన్‌: ప్రతి దేశంలో ప్రజలకు అత్యవసర సమయంలో పోలీస్‌ సేవలు అందుబాటులో ఉండటం కోసం ఆయ దేశాల ప్రభుత్వాలు కొన్ని ప్రత్యేక ఫోన్‌ నెంబర్లను కేటాయిస్తాయి.  ఆ ఫోన్‌ నెంబర్లు అందరికి గుర్తుండేలా ఫ్యాన్సీ నెంబర్‌లా త్రి డిజిట్‌ రూపంలో ఉంటుంది. వీటిని ప్రజలు అత్యవసర సమయాల్లో వినయోగించుకునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తే కొంతమంది తెలిసి చేస్తారో తెలియక చేస్తారో గానీ అనవసరమైన వాటి గురించి కాల్‌ చేసి మరీ విసిగిస్తారు.

(చదవండి: ఎర్త్‌షాట్‌ ప్రైజ్‌ గెలుచుకున్న భారత్‌)

దీంతో పోలీస్‌ అధికారులు పరిస్థతి ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేం కదా. అయినా అవి ప్రజల  సంరక్షణార్థం ఏర్పాటు చేస్తే వాటిని ప్రశ్నార్థకం చేసేలా అనవసరమైన వాటికి కాల్‌ చేసి విసిగిస్తే ఎవ్వరికైన కోపం రాకుండా ఉండదు కదా. అచ్చం అలాంటి సంఘటనే యూకేలోని థేమ్స్‌ వ్యాలీ పోలీస్‌ అధికారులకు ఎదురైంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఒక వ్యక్తి పోలీస్‌ ఎమర్జెన్సీ కాల్‌ 999 (వృద్ధుల సహాయ నిమిత్తం ఏర్పాటు చేసింది)కి కాల్‌ చేసి "నేను ఒక సూపర్‌ మార్కెట్‌కి వెళ్లి కుళ్లిపోయిన చికెన్‌  కొనుగోలు చేసి ఫ్రిజ్‌లో నేరుగా పెట్టేశాను. ఆ తర్వాత చూస్తే కుళ్లిపోయిందని, తాను ఆ విషయం గురించి సూపర్‌ మార్కెట్‌ అధికారులోతో చెప్పాను. నాకేం ఏంచేయాలో తెలియడం లేదా ఏదైన సలహ ఇవ్వండి" అని కూడా చెబుతాడు.

దీంతో ఆ పోలీస్‌ అధికారి ఇది వృద్ధుల సహాయ నిమిత్తం ఏర్పాటు చేసింది, క్రైమ్‌కి సంబంధించిన ఫిర్యాదులను మాత్రమే స్వీకరిస్తామని చెప్పి కాల్‌ కట్‌ చేసేస్తాడు. పైగా ఇలాంటి పిచ్చి పిచ్చి కాల్స్‌ నిరంతరం వస్తుండటంతో సదరు పోలీస్‌ అధికారులు వీటికి వెంటనే చెకపెట్టాల్సిందే అని అనుకున్నారు. దీంతో సదరు అధికారులు అనుకున్నదే తడువుగా ఆ కాల్‌ క్లిప్‌ని రికార్డు చేసిన వీడియో తోపాటు "డయల్‌ చేసే ముందు కాస్త ఆలోచించండి" అనే ట్యాగ్‌లైన్‌ జోడించి ఫేస్‌ బుక్‌లో షేర్‌ చేశారు. ప్రస్తతం ఇది కాస్త నెట్టింట తెగ వైరల్‌ అయ్యింది. దీంతో ఆ ఆడియా క్లిప్‌కి లక్షలో వ్యూస్‌లు,  లైక్‌లు వచ్చాయి. మీరు కూడా వినండి.

(చదవండి: "అవాక్కయేలా చేద్దాం అనుకుంటే అరెస్ట్‌ అయ్యాడు!")

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top