కాంగ్రెస్‌ కుట్రలో రాహుల్‌ గాంధీ బాధితుడా? కేంద్ర మంత్రి సెటైర్‌

Anurag Thakur Ask Is Rahul Gandhi Victim Of Congress Conspiracy - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ అనర్హత వేటు విషయమై విపక్షాలన్ని ఏకమై వ్యతిరేకిస్తూ..నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. ఈ మేరకు ఠాకూర్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..పరువు నష్టం కేసులో రాహుల్‌ని అనర్హుడిగా ప్రకటించినప్పుడూ కాంగ్రెస్‌కి చెందిన ప్రముఖ న్యాయవాది ఎవరూ ఎందుకు సహాయం చేసేందుకు ముందుక రావడం లేదని ప్రశ్నించారు. గాందీని వదులుగా ఉండే ఫిరంగిలాంటి వారిని, నేరస్తుడని విమర్శించారు. రాహుల్‌పై వివిధ కోర్టలలో దాదాపు ఏడు పరువు నష్టం కేసులు ఉన్నాయన్నారు.

అలాగే ఆయనపై అనర్హత వేటు పడటంలో ‍ప్రభుత్వం ప్రమేయం గానీ, లోక్‌ సభ సచివాలయ పాత్ర గానీ లేదని తేల్చి చెప్పారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం.. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడి, ఆ వెంటనే రాహుల్‌ అనర్హతకు గురయ్యారని ఠాకూర్‌ అన్నారు. ఈ కేసులో రాహుల్‌కి కాంగ్రెస్‌కి సంబంధించిన ప్రముఖ న్యాయవాదులెవరూ ఎందుకు సాయం చేయలేకపోయారని అడిగారు. ఒక వేళ ఇది ఉద్దేశ పూర్వకంగా జరిగిందా? లేదా కాగ్రెస్‌ కుట్రలో భాగమా? అని ప్రశ్నించారు. పవన్‌ ఖేరాను రక్షించడానికి కేవలం గంట వ్యవధిలోనే మొత్తం న్యాయవాదులందరూ రావడం జరిగింది. మరీ రాహుల్‌కి మద్దతుగా ఏ కాంగ్రెస్‌ నాయకుడు కోర్టుని ఆశ్రయించలేదే, అంటే దీనినిబట్టి రాహుల్‌పై కుట్ర పన్నుతుంది ఎవరూ అని కేంద్ర మంత్రి గట్టిగా నిలదీశారు.

ఆయన సుప్రీంకోర్టుకి వ్రాతపూర్వకంగా క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా  రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌(ఆర్‌ఎస్‌ఎస్‌) వంటి సంఘాలు, వ్యక్తులు, సంస్థలపై పరువువ నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయడం కొనసాగించారన్నారు. విలేకరుల సమావేశంలో ఓ జర్నలిస్టుతో కూడా రాహుల్‌ పరుషంగా మాట్లాడరన్నారు. తను పరుషంగా మాట్లాడతాడని కూడా చాలామందికి తెలియదని, గత 15 ఏళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ అతని తప్పులను కవర్‌ చేసుకుంటూ వస్తోందని విమర్శులు గుప్పించారు. పైగా ఇలాంటి వ్యక్తి మళ్లా పత్రికా స్చేచ్ఛగా మాట్లాడతుంటారని ఎద్దేవా చేశారు.

రాహుల్‌ గాంధీ కుటుంబ ప్రభావం నుంచి బయటకు రాలేకపోతున్నారని అన్నారు. అలాగే అదానీ విషయంలో బీజేపీ డిఫెన్స్‌ ఉందన్న ఆరోపణలను తోసిపుచ్చారు. విదేశీ గడ్డపై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ పట్టుబడుతూ.. ఇలా రాహుల్‌ విషయంలో వ్యవహరిస్తోందన్న ఆరోపణలను సైతం ఖండించారు. అలాగే అదానీ అంశం గురించి ఆర్థిక మంత్రి నిర్శలా సీతీరామన్‌ కూడా సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుందని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇందులో దాచడానికి ఏమి లేదన్నారు. తమ సంస్థలు బలంగా ఉన్నాయని, వాటిని విశ్వసించమని నొక్కిచ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ దేశ న్యాయవ్యవస్థ, పార్లమెంట్ కార్యకలాపాలు, ప్రజలు వీటిన్నికంటే గాంధీ కుటుంబానికే ప్రాధాన్యత ఇస్తోందంటూ అనురాగ్‌ ఠాకూర్‌ మండిపడ్డారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top