మిజోరం వండర్‌ కిడ్‌కి అమిత్‌ షా స్పెషల్‌ గిఫ్ట్‌ | Amit Shah Gifts Guitar To Mizoram's Wonder Kid | Sakshi
Sakshi News home page

మిజోరం వండర్‌ కిడ్‌కి అమిత్‌ షా స్పెషల్‌ గిఫ్ట్‌

Mar 16 2025 3:18 PM | Updated on Mar 16 2025 3:29 PM

Amit Shah Gifts Guitar To Mizoram's Wonder Kid

ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఓ చిన్నారికి గిటార్‌ను బహుమతిగా ఇచ్చారు.

మిజోరాం: ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటిస్తున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. ఓ చిన్నారికి గిటార్‌ను బహుమతిగా ఇచ్చారు. శనివారం మిజోరాంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ఏడేళ్ల చిన్నారి ఎస్తేర్ లాల్దుహవ్మి హనామ్టే వందేమాతరాన్ని పాడింది. ఆ చిన్నారిని అభినందిస్తూ గిటార్‌ను బహుమతిగా ఇచ్చారు. 

ఆ చిన్నారిని "వండర్ కిడ్"గా అభివర్ణించిన అమిత్‌ షా.. భారత్‌పై ప్రేమ మనల్ని ఏకం చేసిందన్నారు. ‘‘చిన్నారి ఎస్తేర్‌ వందేమాతరాన్ని పాడి నా హృదయాన్ని కదిలించింది.. ఏడేళ్ల చిన్నారికి దేశంపై ఉన్న ప్రేమ తన పాటలో కనిపించింది’ అంటూ  ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆ చిన్నారి పాట వీడియోను కూడా ఆయన పంచుకున్నారు. కాగా, 2020లో ‘మా తుజే సలామ్‌’ పాట వీడియోతో అందరి దృష్టిని ఆకర్షించిన ఎస్తేర్‌.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆమె అనేక అవార్డులను కూడా అందుకుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement