ఛీ ఛీ రుచిగా లేవు.. తిన్నాక నాకు లూజ్‌ మోషన్స్‌..

Amazon Customer Eat Cow Dung Cakes And Post Review On Site - Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఆన్‌లైన్‌ షాపింగ్‌ దిగ్గజం అమెజాన్‌లో దొరకని వస్తువు అంటూ ఉండదు. నిత్యావసర సరుకుల నుంచి పండగలకు వాడే సంప్రాదాయ వస్తువుల వరకు అందుబాటులో ఉన్నాయి. తాజాగా అమెజాన్‌ ఆవు పేడ పిడకలను కూడా అమ్ముతున్న సంగతి తెలిసిందే. విదేశాల్లోని భారతీయుల దృష్ట్యా వారు జరపుకునే సాంప్రదాయ పండగలకు, పూజల నిమిత్తం నాణ్యమైన ఆవు పేడ పిడకలను ఆమెజాన్‌ అందుబాటులోకి తీసుకువచ్చింది. వీటిని ‘కౌవ్‌ డంగ్‌ కేక్‌’ అనే పేరుతో విక్రయిస్తుంది. అవి చూసిన ఓ విదేశీ కస్టమర్‌ వీటిని కొత్తరకం కేకులు అనుకున్నాడేమో కానీ ఆర్టర్‌ చేసుకున్నాడు. అనంతరం అవి తిని అతడు ఇచ్చిన రివ్వూ ప్రస్తుతం నెట్టింటా నవ్వులు పూయిస్తోంది. ఇది చూసిన భారత కస్టమర్స్‌, నెటిజన్‌లు అవాక్కవుతున్నారు.

డాక్టర్‌ సంజయ్‌ ఆరోరా అనే ట్వీటర్‌ యూజర్‌ అమెజాన్‌ యాప్‌లో అతడి రివ్యూ ఫొటోను పోస్టు చేయడంతో అసలు సంగతి వెలుగు చూసింది. ‘యే మేరా ఇండియా.. ఐ లవ్‌ ఇండియా’ అంటూ చేసిన ఈ ట్వీట్‌లో రెండు ఫొటోలు షేర్‌ చేశాడు. ఇందులో అమెజాన్‌ కౌవ్‌ డంగ్‌ కేక్‌ పేజీ రివ్యూతో ఉండగా మరో దాంట్లో‌  ‘ఛీ.. వీటి రుచి అస్సలు బాగాలేదు. ఇందులో మట్టి, గడ్డి కలిసినట్టుగా ఉంది. ఇవి తిన్న తర్వాత నాకు లూజ్‌ మోషన్స్‌ కూడా అయ్యాయి. ప్లీజ్‌ వీటిని తయారు చేసేటప్పుడు కాస్తా శుభ్రత పాటించండి. అలాగే కొంచెం క్రంచిగా ఉండేలా కూడా చూసుకోండి’ అంటూ రివ్యూ ఇచ్చాడు. దీంతో అతడికి ఇవి ఏంటనేది స్పష్టత లేదని అర్థం అవుతోంది.

అయితే ఆమెజాన్‌ ఈ ప్రోడక్ట్‌ కింద ‘ఇవి పండగలు, పూజలు ఇతర సాంప్రదాయా కార్యక్రమాలు వాడే పిడకలు. సహజమైన, నాణ్యమైన ఆవు పేడతో చేసిన కౌవ్‌ డంగ్‌ కేక్స్‌’ అని కూడా స్పష్టంగా రాసింది. అయినప్పటికి అతడి ఇవి ఏంటనేది స్పష్టంగా తెలియదని అర్థమౌవుతోంది. అయితే డాక్టర్‌ ఆరోరా చేసిన ఈ పోస్టుకు మాత్రం నెటిజన్‌లు అవాక్కవుతున్నారు. ‘ఇది నిజమేనా!!’,‘నిజంగానే ఇది జరిగిందా’ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా మరికొందరూ ‘హహ్హహ్హ అవును కచ్చితం క్రంచీ గా ఉండాలి మరి’ అంటూ తమదైన శైలిలో కామెంట్‌ చేస్తున్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top