
వార్షిక అమర్‌నాథ్ యాత్ర గురువారం ప్రారంభయ్యాక బల్తాల్ మార్గంలో యాత్ర కొనసాగిస్తున్న భక్తులు.
మంచు పర్వతాల్లో కొలువైన మంచురూప అమరేశ్వరుడి దర్శనార్థం వేలాది మంది శివభక్తులు ‘అమర్‌నాథ్’ యాత్రగా బయల్దేరారు. 43 రోజులపాటు కొనసాగే అమర్‌నాథ్ యాత్ర గురువారం మొదలైంది. ఆర్టికల్ 370 రద్దు, కోవిడ్ సంక్షోభాల నేపథ్యంలో దాదాపు మూడేళ్ల తర్వాత యాత్ర ప్రారంభమవడంతో ఈసారి భక్తుల తాకిడి విపరీతంగా ఉండే అవకాశముంది.