ల్యాండింగ్‌ సమయంలో పేలిన విమాన టైర్‌ | Alliance Air Delhi Bilaspur flight tyre bursts on landing | Sakshi
Sakshi News home page

ల్యాండింగ్‌ సమయంలో పేలిన విమాన టైర్‌

Aug 28 2026 8:35 PM | Updated on Aug 28 2026 8:41 PM

 Alliance Air Delhi Bilaspur flight tyre bursts on landing

ఢిల్లీ నుంచి బిలాస్‌పూర్‌కు వెళ్తున్న అలయన్స్‌ ఎయిర్‌ విమానం టైరు ల్యాండింగ్‌ సమయంలో పంక్చర్‌ అయింది. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విమానంలో ఉన్న 41 మందినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. విమానయాన సంస్థకు చెందిన అధికారి ఇందుకు సంబంధించిన వివరాలు తెలిపారు.

అలయన్స్‌ ఎయిర్‌కు చెందిన 9I613 విమానంలో 37 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఓ అధికారి తెలిపారు. ల్యాండింగ్‌ సమయంలో విమానం ఎడమవైపు ఉన్న టైర్‌ పంక్చర్‌ అయినట్లు అధికారి చెప్పారు. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది.

ఘటన తర్వాత ప్రయాణికులు, సిబ్బంది అందరినీ రన్‌వే నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చి టెర్మినల్‌ భవనానికి తరలించినట్లు అధికారి తెలిపారు. ఆ తర్వాత బిలాస్‌పూర్‌ నుంచి వెళ్లాల్సిన విమానం తదుపరి సర్వీసును రద్దు చేసినట్లు విమానయాన సంస్థ అధికారి చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement