
న్యూఢిల్లీ: లఖీంపూర్ ఖేరి ఘటనలో ముందస్తు కుట్ర జరిగిందని సిట్ స్పష్టీకరణ నేపథ్యంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా రాజీనామాపై విపక్షాల డిమాండ్లు వెల్లువెత్తాయి. అయితే తక్షణం ఢిల్లీ రావాలని ఆయనకు అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మీడియా ప్రశ్నలు సంధించగా.. ఆయన సహనం కోల్పోయి మీడియాపై ఫైర్ అయ్యారు.
చదవండి: Lakhimpur Violence: మంత్రి మిశ్రా రాజీనామా ప్రసక్తే లేదు: బీజేపీ
తనయుడు ఆశిష్ మిశ్రా గురించి అడిగిన జర్నలిస్టులపై కేంద్రమంత్రి దుర్భాషలాడారు. ‘మూర్ఖుడిలా ప్రశ్నలు అడగవద్దు. మీరు మానసికస్థితిని కోల్పోయారా?. ఏమి తెలుసుకోవాలని అనుకుంటున్నారు?. నిర్దోషిని నిందితుడిగా మార్చారు. మీకు సిగ్గు లేదా?. నీవు ఒక దొంగ’ అంటూ జర్నలిస్టుపై ఆగ్రహంతో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.