పూర్తిగా మహిళా సిబ్బందితో 90 విమాన సర్వీసులు

Air India says 15percent of its total 1825 pilots are female pilots - Sakshi

న్యూఢిల్లీ: ఆకాశంలో సగం అనే నారీశక్తి నినాదానికి మరింత మద్దతు పలికింది ఎయిర్‌ఇండియా. మార్చి ఒకటోతేదీ నుంచి 90 జాతీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులను పూర్తి మహిళా సిబ్బందితోనే నడిపింది! బుధవారం సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. తమ మొత్తం 1,825 మంది పైలెట్లలో 15 శాతం మంది అంటే 275 మంది పైలెట్లు మహిళలేనని పేర్కొంది.

ఎయిర్‌ఇండియా మొత్తం సిబ్బందిలో 40 శాతానికిపైగా నారీమణులే ఉండటం విశేషం. కాక్‌పిట్‌ క్రూలో 15 శాతం అతివలే. ‘ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ మంది కమర్షియల్‌ ఉమెన్‌ పైలెట్లు ఉన్న దేశం భారత్‌’ అని ఎయిర్‌ ఇండియా సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్యాంప్‌బెల్‌ విల్సన్‌ చెప్పారు. ‘ వైమానిక రంగ సంబంధ వృత్తులను ఎంచుకుంటున్న భారతీయ మహిళల సంఖ్య పెరుగుతోంది. అందుకే ఈ రంగంలో లింగ సమానత్వాన్ని సాధించగలిగే అవకాశం వచ్చింది’ అని ఆయన అన్నారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top