మహిళా పోలీసు కానిస్టేబుల్‌ కొంపమొంచిన వీడియో!

Agra Woman Constable Video In Uniform Lands Her In Trouble - Sakshi

లక్నో: తుపాకీ చేతబట్టి డైలాగులతో హల్‌చల్‌ చేసిన మహిళా పోలీస్‌ కానిస్టేబుల్‌పై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఘటనపై విచారణకు ఆదేశిస్తూ... పోలీస్‌ లైన్స్‌కు అటాచ్‌ చేశారు. కాగా ఆగ్రాలో తాను పనిచేస్తున్న పోలీస్‌ స్టేషనులో  ప్రియాంక మిశ్రా అనే కానిస్టేబుల్‌ ఓ హిందీ డైలాగ్‌కు లిప్‌ సింక్‌ చేస్తూ వీడియో చిత్రీకరించారు. ‘‘హర్యానా, పంజాబ్‌ అనవసరంగా చెడ్డపేరు తెచ్చుకున్నాయి.. గానీ ఇక్కడికి రండి. ఇక్కడ ఐదేళ్ల పిల్లలకు కూడా తుపాకులు వాడటం తెలుసు’’ అంటూ వివాదంలో చిక్కుకున్నారు. 

ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో స్పందించిన ఉన్నతాధికారులు ఆమెను మందలించారు. ఆగ్రా పోలీస్‌ లైన్స్‌కు అటాచ్‌ చేశారు. దర్యాప్తు పూర్తయ్యేంత వరకు అక్కడే ఉండాలని ఆదేశించారు. ఈ విషయం గురించి ఆగ్రా ఎస్‌ఎస్‌పీ మునిరాజ్‌ ‘ది ప్రింట్‌’తో మాట్లాడుతూ... ‘‘ప్రవర్తనా నియమావళిని ఆమె ఉల్లంఘించారు. ఆ వీడియో మా దృష్టికి వచ్చిన వెంటనే చర్యలు తీసుకున్నాం. పోలీస్‌ లైన్స్‌కు ఆమెను పంపించాం. ఘటనపై దర్యాప్తు చేపట్టాం. నివేదిక వచ్చిన తర్వాత తదుపరి నిర్ణయం తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు. 

చదవండి: Viral: అత్తను గెంటేసిన కోడలు.. కొడుకును జవాను చాచి కొట్టడంతో..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top