Viral Video: ‘కచ్చా బాదం’ మరువక ముందే ఇంట‌ర్నెట్‌ను షేక్ చేస్తున్న మరో సాంగ్‌

After Kacha Badam This Grape Sellers Catchy Jingle Goes Viral - Sakshi

సోషల్‌ మీడియా వినియోగం పెరిగిన తర్వాత మారుమూల గ్రామంలో జరిగిన సంఘటన కూడా సెకన్ల వ్యవధిలో ప్రపంచం నలుమూలలా విస్తరిస్తోంది. తమ టాలెంట్‌తో కొందరు రాత్రికి రాత్రే స్టార్స్‌ అయిపోతున్నారు. పాటలు, డ్యాన్స్‌, రీల్స్‌ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవ్వడంతో పాపులారిటీ తెచ్చుకుంటారు. కొన్నిరోజుల వరకు వీరు సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తుంటారు. బచ్‌పన్‌కా ప్యార్‌ బుడ్డోడు, కచ్చా బాదమ్‌ అంకుల్‌ వీరంతా అలా ఫేమస్‌ అయిన వారే...

తాజాగా కచ్చా బాదమ్‌ పాట మరవక ముందే మరో పాట నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. రోడ్డుపై బండి మీద ద్రాక్ష పండ్లను అమ్ముతున్న వ్యక్తి పాడిన పాట ప్రస్తుతం​ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో  ఓ వృద్ధుడు  బండి మీద జామపండ్లు, ద్రాక్షను అమ్ముతూ పాట పాడుతూ కనిపిస్తున్నాడు. చేతిలో టీ కప్పు పట్టుకుని, 15 రూపాయల కే 12 అంగూర్లు తీసుకోండి అంటూ ఓ పాటను అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటికే 2.5మిలియ‌న్ల మంది వీక్షించారు. 109వేల లైక్స్ వ‌చ్చాయి. కావాలంటే దీన్ని మీరూ చూసేయండి.
చదవండి: సీఆర్‌పీఎఫ్ బంకర్‌‌పై మహిళ బాంబు దాడి.. వీడియో వైరల్‌

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top