వింత ఘటన: చెయ్యిని చుట్టేసి మరీ కాటేసిన నాగు.. కసితో కొరికి చంపాడు

8 Year Old Boy Bit Hard Twice Cobra To Death In Chhattisgarh - Sakshi

ఒక బాలుడు పాము కాటేసిందని కోపంతో కసిగా కొరికి చంపేశాడు. ఈ ఘటన చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..చత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లో జష్‌పూర్‌ జిల్లాలోని పండర్‌పాండ్‌ గ్రామంలో దీపక్‌ అనే బాలుడు ఇంటి పెరటిలో ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక పాము అతని చేతిని చుట్టుకుని కాటేసింది. దీంతో ఆ బాలుడు నొప్పితో విలవిల లాడాడు. కానీ పాము బాలుడి చేతిని చుట్టుకుని వదలకపోవడంతో దులుపుకని వదిలించుకునేందుకు యత్నించాడు.

కానీ ఆ పాము బాలుడి చేతిని వదలలేదు. దీంతో కోపంతో ఆ పాముని కసితీరా రెండుసార్లు గట్టిగా కొరికి చంపేశాడు. ఈ సంఘటన జరిగిన వెంటనే బాలుడు కుటుంబసభ్యులు హుటాహుటినా ఆస్పత్రికి తరలించారు. వెంటనే డాక్టర్లు యాంటీ స్నేక్‌ విషాన్ని అందించి ఒక రోజు అంతా అబ్జర్వేషన్‌లో ఉంచారు. తదనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యి వెళ్లిపోయాడు.

ఈ మేరకు పాములకు సంబంధించిన నిపుణుడు ఖైజర్‌ హుస్సేన్‌ మాట్లాడుతూ.. దీపక్‌ త్వరగా కోలుకున్నాడని చెప్పారు. ఇది పొడి కాటు అని అందువల్ల విషపూరితమైన పాము కాటు వేసినప్పటకి విషం విడుదల కాదని చెప్పారు. ఇటువంటి పాము కాట్లు చాలా నొప్పిగా అనిపిస్తాయని, అలాగే కాటు వేసిన చోట సాధారణ కాటు వేసిన లక్షణాలే కనిపిస్తాయని అన్నారు. ఐతే ఇలాంటి సంఘటన మాత్రం ఎప్పుడూ చూడలేదని అన్నారు. అంతేగాదు ఆ ప్రాంతాన్ని గిరిజనుల నాగ్లోక్‌ గ్రామం అని అంటారు. దీన్ని పాముల నివాసంగా చెబుతారు గ్రామస్తులు.

(చదవండి: సెకను వ్యవధిలో జింకను మింగేసిన కొండచిలువ : వీడియో వైరల్‌)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top