పబ్జీ: అరవొద్దన్నందుకు హత్య చేసిన యువకులు

3 PUBG Players Assassinated a Man After Asked Not to Make Noise - Sakshi

జమ్మూ కశ్మీర్‌: పబ్జీ ఆటకు బానిసలై చాలామంది ఇంట్లో తెలియకుండా డబ్బులు పోగొట్టుకున్నారు. మరి కొందరు పబ్జీ  కోసం ఫోన్‌ కొనివ్వలేదంటూ ప్రాణాలు తీసుకున్నారు. ఇంకొందరు పబ్జీ ఆట ఆడొద్దనందుకు మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు పబ్జీ కోసం మరో ఘోరానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది.  పబ్జీ ఆడుతూ ముగ్గురు వ్యక్తులు  గోల చేస్తుండగా ఒక వ్యక్తి పెద్దగా మాట్లాడొద్దని హెచ్చరించాడు. దాంతో కోపం వచ్చిన ఆ ముగ్గురు అతడిని హత్య చేశారు. జమ్మూ జిల్లాలోని ఆర్ ఎస్ పుర తాలుఖాలోని బద్యాల్ ఖాజియన్ గ్రామంలో ఈ సంఘటన జరిగింది. రాజ్ కుమార్, బిక్రమ్ జీత్, రోహిత్ కుమార్ ఆన్‌లైన్‌లో పబ్జీ గేమ్ ఆడుతున్నారు. ఇంతలో దిలీప్ రాజ్ అనే వ్యక్తి వారిని పెద్ద శబ్ధాలు చెయ్యొద్దని కోరాడు. దీంతో ఆగ్రహించిన ఆ ముగ్గురు దిలీప్‌పై అక్కడే ఉన్న చెక్కతో దాడి చేయడంతో అతడు ఘటనా స్థలంలోనే మరణించాడని పోలీసులు తెలిపారు. హత్యకు పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు.  చదవండి: సెల్‌ఫోన్‌లో గేమ్స్‌ ఆడొద్దన్నందుకు..

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top