
రాంచీ: జార్ఖండ్‌లో రెండు వేరువేరు ఏనుగుల దాడి ఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. ఈస్ట్‌సింగ్‌భుమ్ జిల్లాలోనే ఈ రెండు ఘటనలు జరిగాయి. జిల్లాలోని అటవీ ప్రాంతంలో ఉన్న చౌతియా గ్రామంలో ఏనుగు ఒక వ్యక్తిని తొక్కి చంపేసింది. ఇదే జిల్లాలోని డిఘీ గ్రామంలో జరిగిన మరో ఘటనలో ఏనుగు ఓ ఇంటిపై దాడి చేసింది.
ఈ దాడిలో ఇంటి గోడ కూలి లోపల నిద్రిస్తున్న వృద్ధురాలు మరణించింది. జిల్లాలోని అటవీ ప్రాంతంలో వరుసగా ఏనుగుల దాడులు జరుగుతుండటంతో గ్రామస్తులు ఆందోళకు దిగారు. ఏనుగుల దాడిలో మృతిచెందిన వారికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.