యూరియా, డీఏపీతో హార్మూజ్‌ దాటిన 15 నౌకలు | 15 India-bound ships carrying urea and DAP and sulphur cross Hormuz | Sakshi
Sakshi News home page

యూరియా, డీఏపీతో హార్మూజ్‌ దాటిన 15 నౌకలు

Jul 6 2026 5:41 AM | Updated on Jul 6 2026 5:41 AM

15 India-bound ships carrying urea and DAP and sulphur cross Hormuz

న్యూఢిల్లీ: ఎరువులు, ఇతర ముడి పదార్థాలతో కూడిన 15 నుంచి 20 వరకు సరకు రవాణా నౌకలు హార్మూజ్‌ జలసంధిని సురక్షితంగా దాటి భారత్‌ వైపు వస్తున్నాయని కేంద్రం ఆదివారం తెలిపింది.

వీటిలో 8 నౌకల్లో 3.32 లక్షల టన్నుల యూరియా, నాలుగింటిలో 2.57 లక్షల టన్నుల డీఏపీ, మరో మూడు నౌకల్లో 1.11 లక్షల టన్నుల సల్ఫర్‌ ఉందని తెలిపింది. త్వరలోనే మరో ఐదు నౌకలు హార్మూజ్‌ను దాటనున్నాయని వెల్లడించింది. ఒక్కో నౌకలో 25 వేల టన్నుల అమ్మోనియా, 45 వేల టన్నుల చొప్పున యూరియా ఉందని వివరించింది. అదనంగా రెండు నౌకల్లో యూరియా, మరో నౌకలో సల్ఫర్‌ లోడవుతోందని తెలిపింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement