పకడ్బందీగా కుష్టు గుర్తింపు సర్వే | - | Sakshi
Sakshi News home page

పకడ్బందీగా కుష్టు గుర్తింపు సర్వే

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

నారాయణపేట: జిల్లాలో కుష్టు గుర్తింపు సర్వేను పకడ్బందీగా, సమగ్రంగా చేపట్టాలని రాష్ట్ర జా యింట్‌ డైరెక్టర్‌ జాన్‌బాబు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయనతో పాటు రాష్ట్రస్థాయి బృందం సభ్యులు వెంకటేశ్వరాచారి (డిప్యూటీ పీఎంఓ), ఎం.శ్రీనివాస్‌ తొలుత మరికల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో కొనసాగుతున్న సర్వే తీరు ను పరిశీలించారు. అనంతరం జిల్లాకేంద్రంలో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు, సంబంధిత నోడల్‌ పర్సన్‌లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాన్‌బాబు మాట్లాడుతూ.. ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబంలోని ప్రతి ఒక్కరిని పరిశీలించి వ్యాధి అనుమానితులను గుర్తించాలని సూచించారు. వ్యాధి లక్షణాలపై క్షేత్రస్థాయి సిబ్బందికి పూర్తి అవగాహన ఉండాలని.. సర్వేలో భాగంగా ప్రతి ఇంటిని తప్పనిసరిగా సందర్శించి ఎవరికీ మినహాయింపు లేకుండా కుటుంబ సభ్యు లందరినీ పరీక్షించాలని ఆదేశించారు. చర్మంపై మచ్చలు, ఇతర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి సంబంధిత వైద్యాధికారుల ద్వారా పరీక్షలు నిర్వహించాలని చెప్పా రు. వ్యాధి నిర్ధారణ అయితే వెంటనే తగిన చికి త్స అందించేలా చర్యలు తీసుకోవాలని, అను మానిత కేసుల వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి తదుపరి వైద్య సేవలపై పర్యవేక్షణ ఉండాలని స్పష్టం చేశారు. సర్వేలో నిర్లక్ష్యానికి తావులేదని.. నిర్దేశిత మార్గదర్శకాలను విధిగా పాటించాలన్నారు. జిల్లాలో కుష్టు నిర్మూల న సాధించేందుకు వైద్యాధికారులు, ఎంఎల్‌హెచ్‌పీలు, నోడల్‌ పర్సన్లు, క్షేత్రస్థాయి సిబ్బంది స మన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు వ్యాధిపై అవగాహన కల్పిస్తూ సర్వేను విజయవంతం చేయాలని రాష్ట్ర బందం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement