మక్తల్: జూరాల బ్యాక్ వాటర్ కింద ముంపునకు గురైన గ్రామాలకు ప్రభుత్వ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని స్టేట్ ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు భరోసా ఇ చ్చారు. బుధవారం ఆయన మండలంలోని అంకేన్‌పల్లి, అనుగొండ గ్రామాలను సందర్శించారు. అంకేన్‌పల్లిలో ఆర్‌ఆర్ సెంటర్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు తమ సమ్మతిని ఏకగ్రీవంగా తెలియజేశారు. అంకేన్‌పల్లికి ఆర్‌ఆర్ సెంటర్‌కు అవసరమైన 67 ఎకరాల 19 గుంటల భూసే కరణ సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశామన్నారు. ఆర్‌ఆర్ సెంటర్ అభివృద్ధికి అందరూ కలిసిరావాలని పిలుపునిచ్చారు. సెంటర్ అన్ని రకాల మౌలిక వసతులు సిద్ధం చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. కార్యక్రమంలో డీఈఈ వెంకటేష్, తహసీల్దార్ సతీష్‌కుమార్, సర్పంచు రాజమ్మ, మాజీ సర్పంచు గోవర్ధన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


