యూడైస్‌ ప్లస్‌పై దృష్టి సారించండి : డీఈఓ | - | Sakshi
Sakshi News home page

యూడైస్‌ ప్లస్‌పై దృష్టి సారించండి : డీఈఓ

Nov 26 2026 1:53 AM | Updated on Nov 26 2026 1:53 AM

నారాయణపేట ఎడ్యుకేషన్‌: ప్రతి పాఠశాలలో పర్ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండికేటర్‌ (సీజీఐ), విద్యార్థుల, ఉపాధ్యాయుల, పాఠశాల సమాచారాన్ని యూడైస్‌ ప్లప్‌లో తప్పకుండా నమోదు చేయాలని జిల్లా విద్యాధికారి డా. గోవిందరాజు ఆదేశించారు. బుధవారం మండలంలోని జాజాపూర్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన జిల్లాస్థాయి యూడైస్‌ ప్లస్‌, చైల్డ్‌ ట్రాకింగ్‌ శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌లో జిల్లా చివరి స్థానంలో ఉందని, ఎంఈఓలు, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించి ఎఫ్‌ఆర్‌ఎస్‌ నమోదును క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రస్థాయిలో ముందువరుసలో నిలపాలని కోరారు. ప్రతి పాఠశాలలో తాగునీరు, కిచెన్‌ గార్డెన్‌, లైబ్రరీ, సైన్స్‌ ల్యాబ్‌, ప్రత్యేక అవసరాల పిల్లలకు క్యాంపులు నిర్వహించాలన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల సంఖ్య, మౌలిక వసతుల వివరాలు, పాఠ్య పుస్తకాలు, దుస్తులు, బూట్లు, నోట్‌బుక్స్‌ వివరాలు తప్పకుండా యూడైస్‌ ఫ్లస్‌లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా 10వ తరగతి విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని.. వెనకబడిన విద్యార్థులపై శ్రద్ధచూపి తగిన సూచనాలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో సెక్టోరియల్‌ అధికారి నాగార్జునరెడ్డి, జిల్లా సైన్స్‌ అఽధికారి భానుప్రకాష్‌, రిసోర్సుపర్సన్స్‌ సురేష్‌, గోపాల్‌, కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement