కూలీల కొరతతో వరి కోతలకు యంత్రాలను వినియోగిస్తున్నాం. అద్దె ఎక్కువైనప్పటికీ నాలుగైదు రోజులు చేసే పని ఒకే రోజు పూర్తవుతుంది. అ యితే యంత్రాలతో పశుగ్రాసం మాత్రం నష్టపోతున్నాం. బురద పొలాల్లో సైతం యంత్రాలు వరిని కోస్తుండటంతో సమస్యలు కూడా తొలగాయి. – నాగేష్, రైతు, పస్పుల, మక్తల్
ఖర్చు ఎక్కువైనా యంత్రాలతో పంట కోతలు చేపడుతున్నాం. అన్నిరకాల యంత్రాలు అద్దెకు అందుబాటులో ఉండటం, ఒకే రోజు పంట మొత్తం చేతికందుతుండటంతో కూలీల కంటే యంత్రాలవైపు ఆ సక్తి కనబరుస్తున్నాం. అలాగే యంత్రాలతో కోసి న ధాన్యం నేరుగా మార్కెట్‌లో విక్రయించుకునే వీలుంది. – నర్సింహులు, ముష్టిపల్లి, మక్తల్


