బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

బియ్యం అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు

Nov 4 2026 2:02 AM | Updated on Nov 4 2026 2:02 AM

కోస్గి: బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం నిర్ణ యించిన ధరల కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి బాల రాజు హెచ్చరించారు. మంగళవారం పట్టణంలోని పలు నిత్యావసర సరుకుల విక్రయ దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. బీపీటీ–కేఎన్‌ఎం రూ. 66, ఆర్‌ఎన్‌ఆర్‌–తెలంగాణ సోనా రూ.74, హెచ్‌ఎంటీ–జేఎస్‌ఆర్‌ రూ.79కి కిలో చొప్పున విక్రయించాలని ఆదేశించారు. నిబంధలకు విరుద్ధంగా విక్ర యిస్తే పీడీ యాక్టు నమోదు చేస్తామని.. ధరల పట్టికను ప్రదర్శించాలని సూచించారు. ఆయన వెంట ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ నాగరాజు, కాళప్ప ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement