–8లో u
నర్వ: యాసంగిలో వరిసాగు చేయవద్దని ప్రభు త్వం రైతులకు గట్టిగా సూచిస్తోంది. ఎల్‌నినో కారణంగా సాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రాజెక్టుల్లో ఉన్న నీరు తాగునీటి అవసరాల కు వినియోగించాల్సి ఉన్నందున ఆరుతడి పంటలు సాగు చేయడం ఉత్తమమని వ్యవసా యశాఖ ద్వారా విస్తృత ప్రచారం నిర్వహిస్తోంది. ఇప్పటికై తే అధికారికంగా వరికి క్రాప్‌హాలిడే ప్రకటించకపోయినా.. అనధికారికంగా పరోక్షంగా నిషేధం విధించనట్లేనని చెప్పవచ్చు.
సెల్ఫ్ డిక్లరేషన్ నిజమేనా..?
వరి విత్తనాలు విక్రయించే డీలర్లు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ పత్రాలపై సంతకాలు తీసుకోవాలనే పత్రాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వానాకాలం వరి కొనుగోళ్లు పూర్తిస్థాయిలో ప్రారంభంగాకముందే యాసంగి సాగు విత్తనాలపై అధికారులు, ప్రభుత్వం ఆంక్షలు విధించినట్లు వస్తు న్న పుకార్లతో రైతులు వరి సాగుపై సందిగ్ధంలో ఉ న్నారు. ఎల్‌నినో ప్రభావంతో యాసంగిలో వరి సా గు వద్దని.. నీటి లభ్యత ఆధారంగా ఆరుతడి పంటలు సాగుచేయాలని ప్రభుత్వం సూచిస్తున్న నేప థ్యంలో ఇలాంటి పుకార్లతో రైతులు గందరగోళానికి గురవుతున్నారు.ఇది వ్యవసాయశాఖ నుంచి వ చ్చిందా.. లేదా డీలర్లు జారీ చేసిందా అనే విషయంపై స్పష్టత కొరవడిందని రైతులు చెబుతున్నారు.
జిల్లాలో యాసంగి సాగు లక్ష్యం..
జిల్లావ్యాప్తంగా 4.59 లక్షల ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉండగా 4.30 లక్షల ఎకరాల వరకు సాగు అవుతోంది. ఎల్‌నినో ప్రభావంతో ఈ యాసంగి సీజన్‌లో జిల్లాలో 1,48,700 ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. యాసంగి సీజన్‌లో వరి కి బదులు ఆరుతడి పంటలు సాగు చేయాలని రైతులను చైతన్యపర్చేందుకు కేత్ బచావో అభియాన్ కార్యక్రమంలో గ్రామసభలు నిర్వహించింది. వ్యవసాయ అధికారులు, కేవీకే శాస్త్రవేత్తలు, పీజేటీఏయూ శాస్త్రవేత్తలు పాల్గొని రైతులకు సూచనలు అందించారు. నీటి సంరక్షణ, ప్రతి నీటిబొట్టుకు మరింత పంట, వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయం, నూనెగింజలు, పప్పుదినుసులు, ఉద్యా సాగుపై రైతులకు అవగాహన కల్పించారు.
సెల్ఫ్ డిక్లరేషన్‌తో
విత్తనాలంటూ పుకార్లు
సామాజిక మాధ్యమాల్లో ఫారం చక్కర్లు
పంట సాగు మూడోవంతు
పడిపోయే అవకాశం
అవాస్తవమంటున్న అధికారులు
‘ఎల్‌నినో ప్రభావం కారణంగా ప్రభుత్వం వరి వేయవద్దని చెబుతోంది. వరి మాత్రమే సాగు చేసే అవకాశం ఉన్నందున నా సొంత నిర్ణయంతో సాగుకు పూనుకున్నా. విద్యుత్ కోతలు, నీరందక మరే ఇతర కారణాలతోగానీ దిగుబడిరాని పక్షంలో డీలర్‌లకుగాని, ప్రభుత్వానికిగాని ఎలాంటి సంబంధం లేదు. ఇది నా ఇష్టపూర్వకంగా నేను తీసుకున్న నిర్ణయం’.


