రూ.2,200 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

రూ.2,200 కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి

Nov 4 2026 2:02 AM | Updated on Nov 4 2026 2:02 AM

● రాష్ట్ర పశుసంవర్ధకశాఖ

మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.2,200 కోట్లతో నియోజకవర్గంలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం పట్టణంలోని కాంగ్రెస్‌పార్టీ కార్యాలయంలో మండలంలోని 39 గ్రామపంచాయతీల నాయకులతో వేర్వేరుగా సమావేశమై గ్రామ సమస్యలపై చర్చించారు. గ్రామాల వారీగా సమస్యలను నమోదు చేసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఏళ్లుగా వెనుకబడిన ప్రాంతంలో నేడు కీలక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని.. రూ.500 కోట్లతో బీటీ, సీసీి పనులు, రూ.80 కోట్లతో ఆస్పత్రి పనులు చేపడుతున్నామని సంక్రాంతిలోగా అందుబాటులోకి తెస్తామని తెలిపారు. రూ.26 కోట్లతో స్టేడియం ఆధునికీకరణ, నాలుగు లైన్ల రహదారి పనులకు రూ.237 కోట్లు మంజూరు చేసినట్లు చెప్పారు. పునరావాస గ్రామాలైన అనుగొండకు రూ.50 కోట్లు, అంకెన్‌పల్లికి రూ.28 కోట్లు, దాదాన్‌పల్లికి రూ.30 కోట్లు మంజూరు చేశామన్నారు. నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల అందుబాటులోకి రావడంతో ఉన్నత విద్యను కొనసాగించే అవకాశం లభించిందని తెలిపారు. నియోజకవర్గంలో 64 మంది విద్యార్థులు విదేశీ ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఒక్కొక్కరికి రూ.20 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించామన్నారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి రహదారి కోసం పాదయాత్ర చేపట్టడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమేనన్నారు. నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించే బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్‌, మాజీ ఎంపీపీ గడ్డంపల్లి హన్మంతు, ఎంపీటీసీ మాజీ సభ్యుడు కోళ్ల వెంకటేష్‌, మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గణేష్‌కుమార్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌, సర్పంచులు సూర్యకుమార్‌, రాజేందర్‌గౌడ్‌, శివారెడ్డి, రహమత్‌పాషా, సత్యారెడ్డి, వెంకట్రాములుగౌడ్‌, శ్రీనివాస్‌గౌడ్‌, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement