రీ సైక్లింగ్‌ దందా..! | - | Sakshi
Sakshi News home page

రీ సైక్లింగ్‌ దందా..!

Nov 2 2026 12:47 AM | Updated on Nov 2 2026 12:47 AM

–8లో u

నారాయణపేట: పేదల ఆకలి తీర్చాల్సిన రేషన్‌ బియ్యం అక్రమ వ్యాపారులకు కాసుల వర్షం కురిపించే సరుకుగా మారింది. లబ్ధిదారుల నుంచి కిలో రూ.30 చొప్పున కొనుగోలు చేసి రీసైక్లింగ్‌ ద్వారా తిరిగి నిత్యావసర సరుకుల దుకాణాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో సన్నబియ్యం క్వింటా రూ.8 వేలకుపైగా పలుకుతుండటంతో అక్రమ వ్యాపారులు బియ్యం సేకరణలో వేగం పెంచారు. జిల్లావ్యాప్తంగా 1.73 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా.. ప్రతి నెల 4,037 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సరఫరా చేస్తున్నారు. మార్కెట్‌లో దీని విలువ రూ.32 కోట్లకు పైమాటే. గతంలో కిలో రూ.20 నుంచి రూ.25 వరకు కొనుగోలు చేస్తుండగా.. ప్రస్తుతం రూ.30 వరకు లబ్ధిదారులకు ఆఫర్‌ ఇస్తున్నారన్న ప్రచారం సాగుతోంది. మార్కెట్‌లో సన్నబియ్యానికి గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో బియ్యం సేకరించే వ్యక్తుల నుంచి పెద్ద వ్యాపారులు, మిల్లుల వరకు నెట్‌వర్క్‌ కొనసాగిస్తున్నట్లు సమాచారం. రేషన్‌న బియ్యాన్ని తక్కువ ధరకు సేకరించి ఇతర మార్గాల్లో విక్రయించడం లేదా రీసైక్లింగ్‌ చేసి తిరిగి మార్కెట్‌కు తరలించే అవకాశాలపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

మండలాల వారీగా వివరాలు ఇలా..

మండలం రేషన్‌ కార్డుల సంఖ్య బియ్యం పంపిణీ

దుకాణాలు (మె.ట.లలో..)

నారాయణపేట 42 27,604 664.508

మక్తల్‌ 40 22,785 540.370

మద్దూరు 38 21,253 487.944

దామరగిద్ద 30 16,705 414.606

కోస్గి 40 18,173 405.722

ఊట్కూర్‌ 26 16,594 383.501

ధన్వాడ 23 11,182 265.989

మరికల్‌ 21 11,370 261.146

నర్వ 18 10,742 232.974

కృష్ణా 12 8,815 196.353

మాగనూర్‌ 12 8,090 184.437

రేషన్‌ బియ్యంపై దళారుల కన్ను

కిలోకు రూ.30 చెల్లిస్తూ కొనుగోలు?

జిల్లాలో 1.73 లక్షల కార్డులు.. 4,037 మె.ట. బియ్యం సరఫరా

మార్కెట్‌ విలువ రూ.32 కోట్లకుపైగా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement